ర్యాలీలో పాల్గొన్న
ముస్లింలు
మిలాద్ ఉన్ నబీని పురస్కరించుకొని బుధవారం సాయంత్రం జిల్లాకేంద్రంలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ఊరేగింపు గాంధీచౌక్, కమాన్ చౌరస్తా, అంబేడ్కర్ చౌక్, రాజీవ్ చౌక్, బస్టాండ్, పాత బస్టాండ్ తదితర ప్రధాన ప్రాంతాల మీదుగా కొనసాగింది. కార్లు, జీపులు, ఆటోలు, ఇతర వాహనాలను ప్రత్యేకంగా అలంకరించి ఊరేగించడంతో సందడి వాతావరణం నెలకొంది. ఊరేగింపులో ముస్లింలు అధికసంఖ్యలో పాల్గొనగా.. ఓ యువకుడు తెల్ల గుర్రంతో చేసిన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
– వనపర్తి టౌన్


