వనపర్తిరూరల్: రైసుమిలుపై రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, జిల్లా పౌరసరఫరాల అధికారుల బృందం సోమవారం పెబ్బేరు పట్టణంలోని సాయిగణేష్ రైసు మిల్లులో తనిఖీలు నిర్వహించారు. 2022–23 రబీ సీజన్‌లో మిల్లు ధాన్యం కేటాయించిన ధాన్యం మిల్లులో నిల్వ ఉన్న బస్తాలను అధికారులు లెక్కించారు. కేటాయించిన ధాన్యంలో 4,946 మెట్రిక్ టన్నుల బస్తాలు తేడా వచ్చినట్లు అధికారులు గుర్తించారు. విలువ 18.35 కోట్లు ఉంటుదని మేనేజర్ ఆంజనేయులు తెలిపారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు చర్యలు ఉంటాయని ఆయన తెలిపారు.


