వెల్లివిరిసిన
240 అడుగుల మువ్వన్నెల
జెండా ప్రదర్శన
జిల్లాకేంద్రంలో గురువారం 240
అడుగుల పొడవున్న జాతీయ జెండాను ప్రదర్శించారు. హర్ ఘర్ తిరంగా ర్యాలీ జిల్లా కన్వీనర్ బచ్చు రాము ఆధ్వర్యంలో విద్యార్థులు పాలిటెక్నిక్ కళాశాల నుంచి అంబేడ్కర్ చౌక్, గాంధీ చౌక్ మీదుగా పట్టణ వీధుల్లో దేశభక్తి నినాదాలు
చేస్తూ ప్రదర్శించారు. ఉదయం 10 నుంచి 11.30 వరకు సాగిన హర్ ఘర్ తిరంగా ర్యాలీ ఆద్యంతం అందరిని
కట్టిపడేసింది. – వనపర్తిటౌన్


