చాలామంది రైతులు ఇప్పటికే బోరుబావుల కింద వరి సాగు చేశారని, ఆయా పంటలను రక్షించుకునేందుకు వారాబంధి విధానంలో నీటిని విడుదల చేయాలని కోరారు. అదేవిధంగా ఎల్‌నినో కమిటీ సిఫారసు చేసిన పంటలు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని.. కూరగాయలు, ఆరుతడి పంటల సాగుపై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. కొత్తకోట మండలం కానాయపల్లి ఆర్‌అండ్‌ఆర్ సమస్యను పరిష్కరిస్తే శంకర సముద్రం రిజర్వాయర్ పరిధిలోని 12 గ్రామాలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించేందుకు అవకాశం ఉంటుందని.. ఈ విషయంపై కేబినెట్‌లో చర్చించాలని మంత్రులను కోరారు.


