పెట్టుబడిపై నమ్మకం కలిగింది.. | - | Sakshi
Sakshi News home page

పెట్టుబడిపై నమ్మకం కలిగింది..

Aug 9 2026 12:17 AM | Updated on Aug 9 2026 12:17 AM

మాది రామన్‌పాడు జలాశయం పరిధిలోని అజ్జకొల్లు గ్రామం. వానాకాలం ఆరంభంలో వర్షాలు ఆలస్యం అవుతాయేమోనని చాలా భయమేసింది. కురవవు అనుకున్న సమయంలో వరణుడు కరుణించడంతో పాటు రామన్‌పాడు నుంచి నీరు వదలడం మాకు వరంగా మారింది. ప్రస్తుతం వరి నాట్లు వేస్తున్నాం. వర్షాల పుణ్యమా అని ఈసారి పెట్టిన పెట్టుబడికి గింజ పండుతుందన్న నమ్మకం ఏర్పడింది. – తోకల రవి,

రైతు, అజ్జకొల్లు (మదనాపురం)

సాగు పనులు ముమ్మరం..

ఇటీవల కురిసిన వర్షాలు, ప్రాజెక్టుల నుంచి సాగునీరు అందుతుండటంతో జిల్లాలో సాగు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ వర్షాలు అన్నదాతలకు వరంలా మారాయి. భూమిలో తగినంత తేమ శాతం రావడంతో దుక్కులు సులభతరమయ్యాయి.

– ఆంజనేయులు,

జిల్లా వ్యవసాయ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement