4 ఎకరాల్లో వరి సాగు చేయడానికి నారుమడి సిద్ధం చేసుకున్నా. పొలం దుక్కిదున్ని నాట్ల కోసం సిద్ధం చేసుకున్నా. తీరా బోరుబావి నుంచి నీరు ఆగి ఆగి వస్తుండటంతో చేసేది లేక వరినారు వదిలేశా. విద్యుత్ కష్టాలతో పాటు జూరాల జలాశయంలో నీరు లేకపోవడంతో బోరుబావిలో నీటిమట్టం తగ్గుముఖం పట్టింది.
– సుధాకర్‌రెడ్డి, రైతు, నందిమళ్ల
ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవక ప్రధాన జలాశయాల్లో నిల్వ నీటిమట్టం తగ్గడంతో విద్యుదుత్పత్తి చేపట్టడం లేదు. ఉన్న విద్యుత్‌ను జాగ్రత్తగా వినియోగించుకునేందుకు బోరుమోటార్లకు నిత్యం 15 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్నాం. రైతులు వరిసాగుకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఆరుతడి పంటలు వేసుకుంటే ఉన్న విద్యుత్‌తో పంటలకు నీరు వాడుకోవచ్చు.
– తాతారావు, ఏఈ, ట్రాన్స్‌కో


