‘మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు బీజేపీ వ్యతిరేకం’ | - | Sakshi
Sakshi News home page

‘మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు బీజేపీ వ్యతిరేకం’

Jul 21 2026 12:53 AM | Updated on Jul 21 2026 12:53 AM

అమరచింత: మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తి వ్యతిరేకమని ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు సృజన ఆరోపించారు. భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా మూడో మహాసభలు సోమవారం పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై సంఘం జెండాను ఎగురవేసి మాట్లాడారు. డీలిమిటేషన్‌ లింకుతో మహిళా రిజర్వేషన్‌ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టకపోవడాన్ని పూర్తిగా వ్యతిరేస్తున్నామన్నారు. బిల్లు అమలు బీజేపీకి ఏ మాత్రం ఇష్టం లేదని స్పష్టం చేశారు. దేశంలో మహిళలపై అనేక అఘాయిత్యాలు, ధౌర్జన్యాలు, హత్యలు జరుగుతున్నా ప్రధాని నరేంద్రమోదీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం తగదన్నారు. మహిళలు లేనిదే దేశంలో ఏ కార్యక్రమం లేదని.. మహిళలకు సమాన హక్కులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకమై ఆ పార్టీని గద్దెదించాలని పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్‌, వనపర్తి జిల్లా అధ్యక్షులు పద్మ, కృష్ణవేణి, జిల్లా కార్యదర్శి సీత మ్మ, నాయకులు జయమ్మ, కళావతమ్మ, పద్మ, సీపీఐ జిల్లా కార్యదర్శి విజయరాములు, మండల కార్యదర్శి అబ్రహం, పట్టణ కార్యదర్శి రవీందర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement