● రెవెన్యూ అదనపు కలెక్టర్
వినోద్‌కుమార్
వనపర్తి/వనపర్తిరూరల్: ప్రజావాణి అర్జీలను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించి నివేదిక ఇవ్వాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్‌కుమార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో ఆయన పాల్గొని అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించి క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పరిష్కారం కోసం ఆయా శాఖల అధికారులకు సిఫారస్ చేశారు. మధ్యాహ్న భోజన విరామ సమయం వరకు మొత్తం 61 అర్జీలు దాఖలయ్యాయి. అదేవిధంగా ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి రెండు అర్జీలు రాగా.. పరిష్కారం కోసం ఆర్డీఓ అధికారులకు సిఫారస్ చేశారు.


