వనపర్తిటౌన్: తెలంగాణ ఓపెన్ స్కూల్స్‌లో 2026–27 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ రవీందర్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓపెన్ స్కూల్, దూర విద్య విధానం ద్వారా అందించే ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్‌లో ప్రవేశానికి ఈనెల 28 వరకు నిర్ణీత రుసుము చెల్లించి దరఖాస్తులు సమర్పించాలన్నారు. ఆలస్య రుసుముతో ఆగస్టు 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అభ్యర్థులు ఫారాన్ని అప్‌లోడ్ చేసి తమ పేర్లను నమోదు చేసుకోవాలని, పూర్తి వివరాల కోసం జిల్లా విద్యాధికారి కార్యాలయం, ww-w.telanganaope nschool.org వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
పెద్దమ్మ తల్లీ కరుణించమ్మా..
గోపాల్‌పేట: మండల కేంద్రంలో మంగళవారం పెద్దమ్మ బోనాల పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలు ఒకేరోజు పెద్దమ్మతల్లికి బోనమెత్తి కుటుంబసమేతంగా అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. మొదట మహిళలు అందంగా అలంకరించిన కుండల్లో నైవేధ్యం తయారు చేసి, ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని అమ్మవారికి నైవేధ్యం సమర్పించారు. కార్యక్రమానికి మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
25న లక్ష్మీచెన్నకేశవుడికి లక్ష పుష్పార్చన
జడ్చర్ల టౌన్: మండలంలోని గంగాపురం శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామికి ఆషాఢ శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని శనివారం లక్ష పుష్పార్చన నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ దీప్తిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వేడుక కొనసాగుతుందన్నారు. అనంతరం 4 గంటలకు అమ్మవారికి కుంకుమార్చన ఉంటుందన్నారు. తెల్లవారుజామన సుప్రభాత సేవతో ప్రారంభమయ్యే వేడుక 6.30 గంటలకు పంచామృతాభిషేకం, 9 గంటలకు పుణ్యాహవాచనం, రుత్విక్వరణం, సాయంత్రం 5 గంటలకు ప్రదోశ పూజ, రాత్రి 9 గంటలకు శయనోత్సవం జరిపించి మరుసటి రోజు ఆదివారం 7 గంటలకు స్వామికి సహస్రనామార్చన, 8 గంటలకు మహానివేదన చేస్తామన్నారు.


