ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు నర్సింహారెడ్డి. ఆత్మకూర్ మండలంలోని మూలమళ్ల గ్రామం. జూరాల ఆయకట్టు పరిధిలో ఈసారి 14 ఎకరాల్లో వరి పంటను సాగుచేసేందుకు అవసరమైన నారును సిద్ధం చేసుకుని, కరిగెట చేయించాడు. ఇప్పటికే రూ.లక్ష పైగా ఖర్చుతో సాగు పనులు పూర్తి చేసిన తర్వాత సాగునీరు అందకపోవడంతో ఆందోళన చెందుతున్నాడు. ఎడమ కాల్వలో నీరు లేదని సమాంతర కాల్వ ద్వారా పైప్‌లైన్ వేసి నీరు తీసుకుందామనుకున్న కాల్వను మూసేశారని వాపోతున్నాడు. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి వానాకాలంలో ఇలాంటి పరిస్థితి చూడలేదని చెప్పుకొస్తున్నాడు.


