26.22 శాతం పెండింగ్..
సమీపిస్తున్న గడువు..
● జిల్లాకేంద్రంలో నెమ్మదించిన ప్రక్రియ
● వలస ఓటర్లపై
అధికారుల ప్రత్యేక దృష్టి
● సమీపిస్తున్న గడువు..
బీఎల్వోలపై పెరుగుతున్న ఒత్తిడి
●
అర్హులందరూ తమ ఓటుహక్కు కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఎన్యూమరేషన్ ఫార్యాలను తప్పులు లేకుండా ప్రస్తుత వివరాలు, ఫొటోతో పూరించి నిర్దేశిత గడువులోగా బీఎల్వోలకు అందజేయాలి. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే పదిరోజుల గడువు పొడిగించింది. మరోసారి పెంచే అవకాశం చాలా తక్కువ. ఓటర్లంతా త్వరపడి ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి.
– సుబ్రమణ్యం, ఆర్డీఓ, వనపర్తి
వనపర్తి: భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో బీఎల్వోలు, అధికారులకు క్షేత్రస్థాయిలో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. దీంతో గడువు పదిరోజులు పొడిగించినా.. సరిపోతుందా అనే సందిగ్ధం అధికారులు, ఆయా రాజకీయ పార్టీల్లో ఉన్నాయి. ఆర్డీఓ నిత్యం పోలింగ్‌స్టేషన్ల వారీగా పర్యవేక్షణ చేస్తూ ఎక్కడెక్కడ నెమ్మదించిందో తెలుసుకుని వేగవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వనపర్తి నియోజకవర్గ పరిధిలోని 12 మండలాలు.. 316 పోలింగ్ కేంద్రాల పరిధిలో 2,75,570 మంది ఓటర్లు ఉండగా, అందరికీ ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసినట్లు అధికారుల నివేదికలు వెల్లడిస్తున్నా.. చాలామందికి ఫారాలు చేరలేదు. కొందరు బీఎల్వోల ఇంటికెళ్లి ఫారాలు తెచ్చుకుని తమ ఓటుహక్కును కాపాడుకునే ప్రయత్నం చేసిన వారిలో అక్షరాస్యులు, నిరక్షర్యాసులు, ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఉన్నారు.
మండలం ఓటర్లు పూర్తయిన
శాతం
వనపర్తి 32,496 72.44
ఏదుల 9,587 76.79
రేవల్లి 13,258 78.31
పెద్దమందడి 32,142 79.04
గోపాల్‌పేట 27,321 79.33
పెబ్బేరు 27,999 80.90
శ్రీరంగాపురం 16,451 81.70
అడ్డాకుల 3,959 83.78
ఖిల్లాఘనపురం 33,496 86.32
మూసాపేట 1355 91.00
పురపాలికలు..
వనపర్తి 63,246 53.12
పెబ్బేరు 14,260 65.29
జిల్లాలో ఇప్పటి వరకు 72.88 శాతమే పూర్తి
సోమవారం ఉదయం పది వరకు 72.88 శాతం ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయినట్లు అధికారిక లెక్క. మరో 14 రోజుల్లో 26.22 శాతం పూర్తి చేయాల్సి ఉంది. వివిధ రాజకీయ పార్టీలు సైతం పోలింగ్ కేంద్రాల వారీగా బీఎల్‌ఏలను నియమించుకొని ఓటర్లకు సాయం చేస్తూ వారి ఎన్యూమరేషన్ ఫారాలను పూరించి బీఎల్వోలకు అందజేస్తున్నారు. అయినా ప్రక్రియ నెమ్మదిగానే సాగుతుండటం గమనార్హం.
తెలంగాణాలో ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించే గడువును ఆగస్టు 4 వరకు పొడిగించారు. అయినా ఇచ్చిన గడువు సరిపోతుందా లేదా అనే సందేహంలో బీఎల్వోలు ఉన్నారు. గడువు దగ్గర పడుతున్నా కొద్ది వారిపై వత్తిడి పెరుగుతోంది.


