సుస్థిర అభివృద్ధే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

సుస్థిర అభివృద్ధే లక్ష్యం

Aug 16 2025 6:34 AM | Updated on Aug 16 2025 6:34 AM

సుస్థ

సుస్థిర అభివృద్ధే లక్ష్యం

చీఫ్‌ విప్‌, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి

ఘనంగా 79 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

హాజరైన కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, ఎస్పీ రావుల గిరిధర్‌, ఎమ్మెల్యేలు తూడి మేఘారెడ్డి, మధుసూదన్‌రెడ్డి

వనపర్తి: జిల్లాలో సుస్థిరాభివృద్ధే లక్ష్యంగా అధికా రులు, పాలకులు పనిచేస్తున్నారని శాసనమండలి చీఫ్‌ విప్‌, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా పోలీస్‌ గౌరవ వందనాన్ని స్వీకరించి, వివిధ శాఖల ద్వారా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన లక్ష్యాల ప్రగతి నివేదికను చదివి వినిపించారు. అనంతరం స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులను శాలువాతో సత్కరించారు. వేదికపై కలెక్టర్‌ ఆదర్శ్‌సురభి, ఎస్పీ గిరిధర్‌ రావుల, వనపర్తి, దేవరకద్ర శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి, జి.మధుసూదన్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ రెవెన్యూ కిమ్యానాయక్‌, అదనపు కలెక్టర్‌ స్థానిక సంస్థలు యాదయ్య హాజరయ్యారు.

60,545 రైతులకు

రుణ విముక్తి

గతేడాది ఆగస్టు 15న రైతు రుణమాఫీకి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టగా.. రాష్ట్రంలోని 25.35 లక్షల మంది రైతులకు, రూ.20,616 కోట్ల రుణమాఫీ కాగా.. జిల్లాలో 60,545 మంది రైతులకు రూ.480.91 కోట్ల 91 లక్షల రూపాయల రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. ఇందిరమ్మ రైతు భరోసా కింద ఎకరాకు రూ.12 వేల పెట్టుబడి సాయం అందించినట్లు పేర్కొన్నారు

కొత్తగా 17,490 రేషన్‌ కార్డుల జారీ..

జిల్లాలో కొత్తగా 17,490 రేషన్‌ కార్డులను జారీచేయడంతో పాటు ప్రస్తుతం ఉన్న కార్డుల్లో కొత్తగా 29,858 మందిని చేర్చినట్లు వెల్లడించారు. ప్రజా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది నుంచి రూ.13 వేల కోట్లతో 3.10 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నామన్నారు.

స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, కలెక్టర్‌, ఎమ్మెల్యేలతో కలిసి తిలకించారు. ప్రభుత్వ విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన అధికారులకు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. జిల్లాలోని మెప్మా మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలకు సంబంధించిన రూ.10.08 కోట్ల చెక్కును అందజేశారు. గత విద్యా సంవత్సరంలో ఉత్తమ మార్కులు టెన్త్‌, ఇంటర్‌ విద్యార్థులను సత్కరించి, ఒక్కక్కరికి రూ.10వేల చెక్కు అందజేశారు.

స్పీడ్‌ బోట్‌ ప్రారంభం

కొల్లాపూర్‌ రూరల్‌: మండలంలోని సోమశిల గ్రామ శివారు కృష్ణానదిలో పర్యాటకుల సౌకర్యార్థం జిల్లా పర్యాటక శాఖ అధికారి నర్సింహ శుక్రవారం స్పీడ్‌ బోటు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు టూరిజం కార్పొరేషన్‌ నిధుల నుంచి 6 స్పీడ్‌ బోట్లు మంజూరు చేయించారు. ఈ క్రమంలో మంత్రి జూపల్లి ఆదేశాల మేరకు సోమశిల దగ్గర నదిలో స్పీడ్‌ బోటును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణానదిలో పర్యాటకుల కోసం సోమశిల నుంచి శ్రీశైలం వరకు ప్రయాణించడానికి క్రూయిజ్‌ లాంచీని మంగళవారం నుంచి ప్రారంభిస్తామని చెప్పారు. శ్రీశైలం వెళ్లాలనులకునే ప్రయాణికులు తెలంగాణ టూరిజం వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్‌ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్‌ మద్దిలేటి, నాయకులు రంగస్వామి, రమేష్‌గౌడ్‌, మహే ష్‌, టూరిజం శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పకడ్బందీగా శాంతిభద్రతల పరిరక్షణ

జిల్లాలో మెరుగైన శాంతిభద్రతల కల్పనలో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో కమాండ్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసి అన్ని మండలాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేసి నిత్య పర్యవేక్షణ చేయడం ద్వారా నేరాలను నియంత్రిస్తున్నట్లు తెలిపారు. గంజాయి, డ్రగ్స్‌, ఇతర మత్తు పదార్ధాల వాడకంపై జిల్లాలో ప్రత్యేక పోలీస్‌ నిసూ టీమ్స్‌ ఏర్పాటు చేసి, ప్రత్యేక నార్కోటిక్‌ డాగ్స్‌ ద్వారా బ్లాక్‌ స్పాట్స్‌, బస్టాండ్‌, కళాశాలలు, ఇతర రద్దీ గల ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్‌, యాదయ్య, అడిషనల్‌ ఎస్పీ వీరారెడ్డి, డీఎస్పీలు, వనపర్తి, పెబ్బేరు మార్కెట్‌ కమిటీ చైర్మన్లు శ్రీనివాస్‌గౌడ్‌, ప్రమోదిని, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

సుస్థిర అభివృద్ధే లక్ష్యం1
1/4

సుస్థిర అభివృద్ధే లక్ష్యం

సుస్థిర అభివృద్ధే లక్ష్యం2
2/4

సుస్థిర అభివృద్ధే లక్ష్యం

సుస్థిర అభివృద్ధే లక్ష్యం3
3/4

సుస్థిర అభివృద్ధే లక్ష్యం

సుస్థిర అభివృద్ధే లక్ష్యం4
4/4

సుస్థిర అభివృద్ధే లక్ష్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement