
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
కోడేరు: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ వద్ద లబ్ధిదారులకు కుట్టు మిషన్లు, రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలానికి సంబంధించి మైనార్టీలకు 34 కట్టు మిషన్లు మంజూరయ్యాయని తెలిపారు. అదే విధంగా సాతాపూర్, గంట్రావుపల్లి, ఖానాపూర్, కోడేరు వరకు బీటీరోడ్డు, బ్రిడ్జి నిర్మాణం కోసం రూ.13కోట్లు నిధుల కేటాయించినట్లు పేర్కొన్నారు. వారం రోజుల్లో పనులు ప్రారంభిస్తామన్నారు. అదే విధంగా పస్పుల వాగు బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. కోడేరుకు 76 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించినట్లు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలో మహిళలకు ఉచిత బస్సు, రైతు భరోసా, రూ.500 వందలకే గ్యాస్, రుణమాఫీ, రైతుబంధు వంటి పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఎవరూ అధైర్యపడొద్దని, అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రావణ్‌కుమార్, ఆర్‌ఐ జంబులయ్య, పంచాయతీ కార్యదర్శి రవితేజ, మాజీ ఎంపీపీ కొత్త రామ్మోహన్ రావు, సింగిల్ విండో డైరెక్టర్ మహేష్‌రెడ్డి, రంగినేని జగదీశ్వరావు, మాజీ వార్డు సభ్యులు రాజు, సురేష్ యాదవ్, కురుమయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు .