
అనర్హులను ఎంపిక చేస్తే చర్యలు
పాన్‌గల్: పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం మండలంలోని తెల్లరాళ్లపల్లితండాలో 16 మంది, వెంగళాయిపల్లిలో నలుగురికి ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రాలు అందజేసి నిర్మాణాలకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నిర్వహించిన సమావేశంలో ఎంపిక చేసిన లబ్ధిదారులు అర్హులా కాదా అన్న వివరాలు ఆరా తీశారు. తెల్లరాళ్లపల్లితండాలో ప్రభుత్వ ఉద్యోగి కుటుంబానికి ఇల్లు మంజూరు కావడంతో రద్దు చేసి అర్హులైన వేరే కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని.. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, రూ.500కు గ్యాస్ సిలిండర్, పంట రుణమాఫీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు భరోసా వంటి పథకాలు నెరవేర్చినట్లు పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు అనర్హులను ఎంపిక చేసినా, ఇళ్ల మంజూరుకు డబ్బులు వసూలు చేసిన అధికారులు, అధికార పార్టీ నాయకులు ఎవరైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్య, వైద్యానికి మొదటి ప్రాధాన్యం ఇస్తున్నామని.. చదువుతోనే సమాజంలో గుర్తింపు, గౌరవం లభిస్తుందని, పిల్లలను బాగా చదివించాలని కోరారు. మొదటి విడతలో ఇందిరమ్మ ఇల్లు రాని వారికి రెండోవిడతలో మంజూరవుతాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు. ప్రజా ప్రభుత్వంలో అర్హులైన పేదలకు తప్పక న్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ గోవర్ధన్‌సాగర్, ఎంపీడీఓ గోవిందరావు, కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, నాయకులు రవికుమార్, వెంకటేష్‌నాయుడు, పుల్లారావు, భాస్కర్‌యాదవ్, రవినాయక్, ఆయా గ్రామాల నాయకులు పాల్గొన్నారు.
తెల్లరాళ్లపల్లితండాలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి బాల్యానాయక్ ఆధ్వర్యంలో గిరిజనులు మంత్రి జూపల్లికి వినతిపత్రం అందజేశారు. తండా సమీపంలోని కేఎల్‌ఐ డీ–1 కాల్వకు మరమ్మతు చేపట్టాలని, ఇందిరమ్మ ఇళ్లు అధికంగా కేటాయించాలని, ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లు మార్చాలని, ఆరోగ్య ఉప కేంద్రం, అంగన్‌వాడీ కేంద్రాలు, మహిళ సమాఖ్య భవనాల మంజూరు, ప్రాథమిక పాఠశాలకు ఉపాధ్యాయుల కేటాయింపు వంటి సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఆయా సమస్యలపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఆయన పేర్కొన్నారు.
బీఆర్‌ఎస్ నేతల నిరసన
అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు
పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి
జూపల్లి కృష్ణారావు