
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక
కొత్తకోట రూరల్: పెద్దమందడి జెడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న పి.కోమల్ రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు శాంతన్న, పీడీ మన్యంయాదవ్ ఆదివారం, తెలిపారు. ఈ నెల 16న జిల్లాకేంద్రంలో జరిగిన జిల్లాస్థాయి అండర్–15 వాలీబాల్ బాలుర విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబర్చారని.. సోమ, మంగళవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొననున్నట్టు వివరించారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ చక్కటి ప్రతిభ కనబర్చి పాఠశాల, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని హెచ్‌ఎం, ఉపాధ్యాయ బృందం ఆకాంక్షించారు.