
ఘనంగా శ్రీకృష్ణుడి శోభాయాత్ర
వనపర్తిటౌన్: జిల్లాకేంద్రంలోని వల్లభ్‌నగర్‌లో త్రైత సిద్ధాంత ప్రబోధ సేవాసమితి, ఇందూ జ్ఞానవేదిక జిల్లా కమిటీ సంయుక్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించాయి. ఆదివారం శ్రీకృష్ణుడి ప్రతిమను అందంగా ముస్తాబుచేసి పుర వీధుల్లో శోభాయాత్ర నిర్వహించగా మహిళలు గోపికల వేషధారణలో డీజే పాటలకు కోలాటాలు వేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమంలో త్రైతసిద్ధాంత ప్రబోధ సేవాసమితి, ఇందూ జ్ఞానవేదిక జిల్లా కమిటీ అధ్యక్షుడు వెంకట్రాములు, ప్రతినిధులు పద్మ, కృష్ణయ్య, నాగరత్నం, లలిత, కొత్తకోట, మద్దిగట్ల, జిల్లా, మండల అధ్యక్షులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా శ్రీకృష్ణుడి శోభాయాత్ర