
రైతు శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయం
ఆత్మకూర్: తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని.. ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టడం సరికాదని రాష్ట్ర పశుసంవర్దకశాఖ, మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి, మార్కెట్ చైర్మన్ రహ్మతుల్లాతో కలిసి మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రైతుల శ్రేయస్సే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని.. సామాజిక మాధ్యమాల్లో బీఆర్‌ఎస్, బీజేపీ అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టాలని, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో ఘాటుగా సమాధానం ఇవ్వాలని కాంగ్రేస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. పదేళ్లు పాలించి ఏమీ చేయని వారు ప్రస్తుతం విమర్శలు చేస్తుండటం హాస్యాస్పదంగా ఉందని దుయ్యబట్టారు. జూరాల వద్ద రూ.122 కోట్లతో వంతెన, ఆత్మకూర్‌లో 50 పడకల ప్రభుత్వ ఆస్పత్రి నిర్మిస్తామని, రెవెన్యూ డివిజన్ ఏర్పాటు, పరమేశ్వరస్వామి చెరువుకట్ట విస్తరణ, ఆలయానికి దారి, డయాలసిస్ కేంద్రం తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని వివరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పరమేష్, తులసీరాజ్, బంగారు భాస్కర్, మశ్చందర్‌గౌడ్, అజ్మతుల్లా, షాలం, రఫీఖ్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు హాజరు..
కొత్తకోట రూరల్: పట్టణంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. వేడుకలకు రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. అనంతరం కానాయపల్లి శివారులోని శ్రీకృష్ణ ఆలయంలో మంత్రి, ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక యాదవ సంఘం సభ్యులు, స్థానికులు అతిథులకు స్వాగతం పలికారు. అనంతరం శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ప్రధాన వీధుల్లో ఊరేగించి ఆలయం వద్ద ఉట్లు కొట్టే కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పి.ప్రశాంత్, కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నాయకులు పి.కృష్ణారెడ్డి, ఎన్‌జే బోయేజ్, రావుల కరుణాకర్‌రెడ్డి, డా. పీజే బాబు, వేముల శ్రీనివాస్‌రెడ్డి, మేసీ్త్ర శ్రీనివాసులు, ఎల్లంపల్లి నరేందర్‌రెడ్డి, రాములు యాదవ్, సంద వెంకటేష్, యాదవ్ కమిటీ సభ్యులు, పట్టణంలోని వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో సరిపడా యూరియా నిల్వలు
రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి
వాకిటి శ్రీహరి