
పోలీసుల సేవలను వినియోగించుకోండి
వనపర్తి: జిల్లాలో ప్రజలు తమకు జరిగిన అన్యాయాన్ని నేరుగా పోలీసులకు తెలియజేయాలని, పోలీసుల సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. సోమవారం ఫిర్యాదుల స్వీకరణలో భాగంగా బాధితుల నుంచి ఎస్పీ నేరుగా బాధితులతో మాట్లాడారు. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 14 మందితో అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్ల ఎస్‌ఐ, సీఐలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని, పరిష్కారానికి సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం, ఎలాంటి పైరవీలు లేకుండా స్వచ్ఛందంగా పోలీసు సేవలను వినియోగించుకోవాలని చెప్పారు. శాంతిభద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ పనిచేస్తుందన్నారు. ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు. మొత్తం 14 ఫిర్యాదులు వచ్చినట్టు ఎస్పీ కార్యాలయ సిబ్బంది తెలిపారు.
బాధ్యతలు స్వీకరించిన అదనపు కలెక్టర్
వనపర్తి: అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా ఎన్.కీమ్యానాయక్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇది వరకు అదనపు కలెక్టర్ పనిచేసిన వెంకటేశ్వర్లు ఫ్యూచర్ సిటీకి బదిలీ అయినందున ఆయన స్థానంలో కొత్తగా వచ్చిన ఎన్.కీమ్యానాయక్ కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో బాధ్యతలు చేపట్టారు. కొత్తగా వచ్చిన అదనపు కలెక్టర్‌కు కలెక్టరేట్ ఏఓ భానుప్రకాష్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం కార్యాలయ సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
పకడ్బందీగా ‘వందరోజుల’ కార్యాచరణ అమలు
వనపర్తి టౌన్: వనపర్తి మున్సిపాలిటీలో ‘వందరోజుల’ కార్యాచరణ అమలు కార్యక్రమం పకడ్బందీగా కొనసాగుతుంది. ఈ క్రమంలో సోమవారం జిల్లాకేంద్రంల్లోని 2, 20, 6, 15, 25, 32, 23, 1, 8, 29, 27 వార్డుల్లో 100 రోజుల కార్యాచరణ నిర్వహించారు. ఈ సందర్భంగా తడి, పొడి వ్యర్థాల విభజన, డెంగ్యూ, మలేరియాపై అవగాహన, వీధి, పెంపుడు కుక్కలపై ఏబీసీ ప్రచారం, వాణిజ్య లైసెన్స్, పారిశుద్ధ్యం, మురుగు కాల్వల్లోని డెస్టిల్ తొలగించే పనులను కమిషనర్ వెంకటేశ్వర్ పరిశీలించారు. ఇంటిని శుభ్రంగా ఉంచుకున్నట్టే కాలనీని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇంట్లో నిల్వ నీటిని వాడకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఉమామహేశ్వర్‌రెడ్డి, డీఎంసీ బాలరాజు, సూపర్‌వైజర్, వార్డు ఆఫీసర్స్, మున్సిపల్ సిబ్బంది పాల్గొనారు.
గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి
కొల్లాపూర్: జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని సీపీఐ జిల్లా ప్రధాన కార్య దర్శి ఎస్‌ఎండీ ఫయాజ్ డిమాండ్ చేశారు. సోమవారం కొల్లాపూర్‌లోని కేఎల్‌ఐ అతిథి గృహంలో నిర్వహించిన సీపీఐ పార్టీ మండల స మావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొల్లాపూర్ పట్టణానికి చెందిన ఫయాజ్ ఇటీవలే సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియామకం కావడంతో ఆయనను పార్టీ నాయకులు శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. అనంతరం ఫయాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నాగర్‌కర్నూల్ జిల్లాలో వేలాదిగా లంబాడీలు, చెంచులు ఉన్నారన్నారు. వారి జనాభా ఆధారంగా జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పా టు చేయాలన్నారు. నల్లమలలోని వనరులను వినియోగించుకునే విధంగా పరిశ్రమలు నెలకొల్పాలన్నారు. నల్లమల పరిసర ప్రాంతాల ను ఏజెన్సీ కారిడార్‌గా ప్రకటించాలని కోరా రు. కొల్లాపూర్‌లో మామిడి మార్కెట్, ఫిష్ ప్రాసెసింగ్ సెంటర్ స్థాపించాలన్నారు. మొలచింతలపల్లి, అసద్‌పూర్ శివార్లలో రాజవంశస్థుల భూములను సీలింగ్ యాక్టు ప్రకారం పే దలకు పంచాలని ఆయన కోరారు. సమావేశంలో నాయకులు శివుడు, ఇందిర, యూసుఫ్, కుర్మయ్య, కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.

పోలీసుల సేవలను వినియోగించుకోండి