
మహనీయుల త్యాగాలు మరువలేనివి
వనపర్తి: స్వాతంత్య్ర పోరాటంలో అసువులుబాసిన మహనీయుల సేవలు మరువలేనివని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఎస్పీ రావుల గిరిధర్ సాయుధ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బ్రిటీష్ వలస పాలన నుంచి స్వాతంత్య్రం లభించి నేటితో 78 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో దేశం ఎన్నో రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. మన స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను అందరూ గుర్తుచేసుకుంటూ.. వారి స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందిచాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. దేశ, రాష్ట్ర అభివృద్ధిలో శాంతి భద్రతల ప్రాముఖ్యతను గుర్తించుకుని పోలీసు అధికారులు, సిబ్బంది పూర్తి బాధ్యత, నిబద్ధతతో పనిచేయాలని కోరారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఒక్కరినీ సమానంగా చూడాలని, ప్రతి బాధితుడికి న్యాయం చేయగలిగినప్పుడే మన స్వాతంత్య్రానికి నిజమైన సార్థకత లభిస్తుందన్నారు. అనంతరం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని పోలీసు అధికారులకు, సిబ్బందికి చదరంగం, క్యారమ్స్ పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, డీసీఆర్‌బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వరరావు, జిల్లా పోలీసు కార్యాలయం ఏఓ సునందన, వనపర్తి సీఐ కృష్ణయ్య, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, సీసీఎస్ సీఐ రవిపాల్, రిజర్వ్ సీఐలు అప్పలనాయుడు, శ్రీనివాస్, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పోలీస్
కార్యాలయం ఆవరణలో జాతీయ జెండాను
ఆవిష్కరిస్తున్న
ఎస్పీ రావుల గిరిధర్
ఎస్పీ రావుల గిరిధర్