
హోలీ.. సంబరాల కేళి
వనపర్తి: జిల్లావ్యాప్తంగా శుక్రవారం హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. మోదుగపూల రంగు నీళ్లకు బదులుగా.. దుకాణాల్లో లభించే రసాయన రంగులతో జిల్లాకేంద్రమైన వనపర్తితో పాటు వివిధ ప్రాంతాల్లో చిన్నారులు, యువత, మహిళలు పండుగ జరుపుకొన్నారు. యువత రంగులు వేసుకొని మోటార్ సైకిళ్లపై తిరుగుతూ కనిపించారు. గతంతో పోలిస్తే ఈసారి పురుషుల కంటే మహిళలు ఎక్కువగా హోలీ వేడుకల్లో కనిపించారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో..
జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీస్ అధికారులు, మీడియా మిత్రులతో కలిసి ఎస్పీ రావుల గిరిధర్ హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. పోలీసు అధికారులు, సిబ్బందికి
రంగులు పూశారు. కార్యాలయ ఆవరణలో ఉట్టి కొట్టడం, జారుడు స్తంభం ఎక్కే పోటీలు నిర్వహించగా సిబ్బంది, అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ తన చిన్నతనంలో హోలీ పండుగలో చోటు చేసుకున్న ఘటనలు, జ్ఞాపకాలను పంచుకున్నారు. వేడుకల్లో ఇన్‌చార్జ్ అదనపు ఎస్పీ ఉమామహేశ్వరరావు, స్పెషల్‌బ్రాంచ్ సీఐ నరేష్, వనపర్తి సీఐ కృష్ణ, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

హోలీ.. సంబరాల కేళి

హోలీ.. సంబరాల కేళి