క్రీడలతో శారీరక దారుఢ్యం
వనపర్తి రూరల్: క్రీడలతో శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని డీవైఎస్‌ఓ సుధీర్‌కుమార్‌రెడ్డి, సర్పంచ్ తిరుపతయ్య అన్నారు. గురువారం మండలంలోని కడుకుంట్ల క్రీడా మైదానంలో రాష్ట్రస్థాయి అండర్–14 బాలికల హాకీ పోటీలను వారితో పాటు ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి బోలమోని కుమార్, పరిశీలకుడు పాండురంగారెడ్డి, మద్దిలేటి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఉమ్మడి 10 జిల్లాల నుంచి 200 మంది మహిళా క్రీడాకారులు పాల్గొన్నారని, శుక్రవారం చివరి పోటీలు ఉంటాయని వివరించారు. రాష్ట్రస్థాయిలో చక్కటి ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను జాతీయస్థాయికి ఎంపిక చేయనున్నట్లు చెప్పారు.
మొదటిరోజు విజేతలు వీరే..
మొదటి మ్యాచ్ మెదక్, ఖమ్మం జట్లు, రెండో మ్యాచ్ రంగారెడ్డి, హైదరాబాద్ జట్ల మధ్య జరగగా డ్రాగా ముగిశాయి. 3వ మ్యాచ్‌లో వరంగల్ జట్టుపై నల్లగొండ జట్టు 2–0 గోల్స్‌తో.. 4వ మ్యాచ్‌లో కరీంనగర్ జట్టుపై మహబూబ్‌నగర్ జట్టు 4–0 గోల్స్‌తో.. 5వ మ్యాచ్‌లో రంగారెడ్డి జట్టుపై నిజమాబాద్ జట్టు 5–0 గోల్స్‌తో.. 6వ మ్యాచ్‌లో కరీంనగర్ జట్టుపై మెదక్ జట్టు 1–0 గోల్స్‌తో.. 7వ మ్యాచ్‌లో వరంగల్ జట్టుపై హైదరాబాద్ జట్టు 2–0 గోల్స్‌తో 8వ మ్యాచ్ ఖమ్మం జట్టుపై మహబూబ్‌నగర్ జట్టు 2–0 గోల్స్‌తో విజయం సాధించాయి.
9వ మ్యాచ్‌లో హైదరాబాద్, నల్లగొండ జట్టుతో తలపడగా డ్రాగా ముగిసింది. 10వ మ్యాచ్‌లో ఖమ్మం జట్టుపై కరీంనగర్ జట్టు 1–0 గోల్స్‌తో.. 11వ మ్యాచ్‌లో వరంగల్ జట్టుపై నిజామాబాద్ జట్టు 4–0 గోల్స్‌తో.. 12వ మ్యాచ్‌లో మెదక్ జట్టుపై మహబూబ్‌నగర్ జట్టు 2–0 గోల్స్‌తో.. 13వ మ్యాచ్ వరంగల్ జట్టుపై రంగారెడ్డి జట్టు 2–0గోల్స్‌తో.. 14 మ్యాచ్ నల్గొండ జట్టుపై నిజమాబాద్ జట్టు 4–0 గోల్స్‌తో విజయం సాధించిందని టోర్నమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి నిరంజన్‌గౌడ్ తెలిపారు. కార్యక్రమంలో పీడీలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
క్రీడలతో శారీరక దారుఢ్యం


