రాష్ట్రస్థాయి క్రాస్‌కంట్రీ పోటీలకు జిల్లా జట్టు
వనపర్తి విద్యావిభాగం: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో జనవరి 2న జరగనున్న 11వ తెలంగాణ రాష్ట్రస్థాయి క్రాస్ కంట్రీ పోటీలకు జిల్లా జట్టును గురువారం ఎంపిక చేసినట్లు డీవైఎస్‌ఓ సుధీర్‌కుమార్‌రెడ్డి తెలిపారు. జిల్లా జట్టు ఎంపికలను జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీధర్ జెండా ఊపి ప్రారంభించారు. పోటీల్లో వివిధ పాఠశాలలు, కళాశాలల అథ్లెట్లు పాల్గొని ప్రతిభ చాటారు. ఎంపికై న క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిథ్యం వహిస్తారని.. క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో మెరుగైన ఫలితాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
అయ్యప్పస్వామి
ఆభరణాల ఊరేగింపు
వనపర్తి టౌన్: శబరిమలలో అయ్యప్పస్వామికి మండలపూజ సందర్భంగా శుక్రవారం జిల్లాకేంద్రంలో నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా పట్టణంలో అయ్యప్ప మాలధారులు గురువారం స్వామివారి ఆభరణాల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. రాజనగరంలోని అయ్యప్ప ఆలయం నుంచి ఆభరణాలను ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రధాన రహదారులు అయ్యప్ప నామస్మరణతో మార్మోగాయి. మండలదీక్ష పూజలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొనాలని అయ్యప్ప సేవాసమితి నిర్వాహకులు కోరారు. మాలధారులు ముత్తుకృష్ణ, కృష్ణసాగర్, స్వామి, పాపిరెడ్డి, నరేందర్‌శెట్టి పాల్గొన్నారు.
ఆదిశిలా క్షేత్రంలో
జడ్జీల ప్రత్యేక పూజలు
మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం జిల్లా సీనియర్ సివిల్ జడ్జీ లక్ష్మి, వనపర్తి జిల్లా ప్రిన్సిపల్ సబ్‌కోర్టు జడ్జీ కళార్చన వేర్వేరుగా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు ఆలయ నిర్వాహకులు అరవిందరావు, అర్చకులు వారికి సాదర స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ విశిష్టతలను వివరించి స్వామి వారి శేషవస్త్రంతో సత్కరించి మెమోంటో అందజేశారు. వారి వెంట ఆలయ నిర్వాహకులు చంద్రశేఖరరావు, అర్చకులు మధుసూధనాచారి, రమేషాచారి, రవిచారి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి క్రాస్‌కంట్రీ పోటీలకు జిల్లా జట్టు


