సమస్యల ప్రాంగణం
జిల్లాకేంద్రంలో పునః ప్రారంభమైన పాత బస్టాండ్
● కనీస సౌకర్యాలైన తాగునీరు,
టాయిలెట్లు లేని దుస్థితి
● వెలగని విద్యుద్దీపాలు.. అరకొరగా
కుర్చీలు
● తిరుగు ప్రయాణంలో లోనికి రాని బస్సులు
–8లో u
●
పాత బస్టాండ్‌లో ప్రయాణికులు దుమ్ము ధూళితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫ్లోరింగ్ లేకపోవడంతో పాటు ప్రాంగణమంతా కనిపించేలా లైట్లు లేవు. పెద్దమందడి బస్సులు యధావిధిగా బస్టాండ్‌లోకి రాకుండా వెళ్తున్నాయి. విద్యుద్దీపాలు ఏర్పాటు చేసి బస్సుల రాకపోకలకు అనువుగా తీర్చిదిద్దాలి.
– పవన్ కుమార్, వ్యాపారి
పాత బస్టాండ్‌ను వినియోగంలోకి తీసుకురావాలని భావించి పునరుద్ధరించాం. ప్రహరీ, మూత్రశాలలు, ఫ్లోరింగ్ నిర్మాణాలకు రూ.28 లక్షలతో ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం. ఆమోదం లభిస్తే అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. – దేవేందర్‌గౌడ్,
డిపో మేనేజర్, వనపర్తి ఆర్టీసీ
వననపర్తిటౌన్: దశబ్దాలుగా నిరుపయోగంగా ఉన్న పాత బస్టాండ్‌ను ఆర్టీసీ అధికారులు ఎట్టకేలకు వినియోగంలోకి తీసుకొచ్చారు. కానీ దీంతో ప్రయాణికులకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ప్రాంగణమంతా దుమ్ము, ధూళితో నిండటంతో లోనికి వచ్చే ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. దీనికితోడు లోనికి, బయటకు వెళ్లేందుకు ఎలాంటి సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో బస్సుల రాకపోకలు అస్తవ్యస్తంగా మారాయి. ఆత్మకూర్, కొత్తకోట మీదుగా మహబూబ్‌నగర్, హైదరాబాద్ వెళ్లే కొన్ని బస్సులు మాత్రమే ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తుండగా.. తిరుగు ప్రయాణంలో లోనికి రాకుండా బయటే ప్రధాన రహదారిపైనే ప్రయాణికులను దించేస్తున్నారు. పాత బస్టాండ్‌కు అతి సమీపంలోనే ఉన్న రాజీవ్‌చౌక్ మినీ బస్టాండ్‌గా మారడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ మార్గంలో వెళ్లే పెద్దమందడి బస్సు అవతలి రోడ్డు నుంచే రాకపోకలు సాగిస్తుండటం గమనార్హం.
33 ఏళ్ల తర్వాత నెల కిందట ఆగమేఘాల మీద హడావుడిగా పాత బస్టాండ్‌ను వినియోగంలోకి తీసుకొచ్చారు. ఇందుకోసం ఏడాది కిందట రూ.9.50 లక్షలతో టెండర్ పిలిచి బేస్‌మెంట్, 15 గీ30 సైజులో రేకుల షెడ్ నిర్మించి కొన్ని కుర్చీలు ఏర్పాటుచేశారు. ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా మట్టిని చదునుచేసి ప్రారంభించారు. బస్సుల రాకపోకల సమయంలో దుమ్ము, ధూళితో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
సమస్యల ప్రాంగణం
సమస్యల ప్రాంగణం
సమస్యల ప్రాంగణం


