జిల్లా స్థాయి రగ్బీ పోటీలకు క్రీడాకారుల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జిల్లా స్థాయి రగ్బీ పోటీలకు క్రీడాకారుల ఎంపిక

Oct 1 2026 12:47 AM | Updated on Oct 1 2026 12:47 AM

బొండపల్లి: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ ఆవరణలో బుధవారం నిర్వహించిన జిల్లాస్థాయి రగ్బీ క్రీడాకారుల ఎంపిక పోటీలకు జిల్లా వ్యాప్తంగా 350 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు నిర్వాహకుడు, స్కూల్‌ వ్యాయామ ఉపాధ్యాయుడు గెద్ద గురునాయుడు తెలిపారు. అండర్‌ 14,17,19 విభాగాల్లో నిర్వహించిన ఎంపిక పోటీలకు జిల్లా నలుమూలలు నుంచి భారీగా బాలబాలికలు హాజరయ్యారని పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక చేశామని తెలిపారు. కార్యక్రమంలో హెచ్‌ఎం ఉమామహేశ్వర్రావు, నిర్వాహకులు వడ్డాది శ్రీనివాసరావు, రాంజీ, శేఖర్‌, సతీష్‌, చంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

గల్లంతైన వ్యక్తి కోసం ముమ్మర గాలింపు

వీరఘట్టం/పాలకొండరూరల్‌/పాలకొండ: వీరఘట్టం మండలం పనస నందివాడ గ్రామానికి చెందిన పాలకొండ సుబ్చారావు కోసం అధికారులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. సుబ్బారావు మంగళవారం రాత్రి పడవ నుంచి పడి నదిలో కొట్టుకుపోయిన విషయం విదితమే.. దీనిపై సబ్‌ కలెక్టర్‌ పవర్‌ స్వప్నిల్‌ అగ్నిమాపక సిబ్బందితో మాట్లాడి నదిలో గాలింపు చేపట్టారు. మంగళాపురం గ్రామం వద్ద బుధవారం గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. ఈ సందర్భంగా సబ్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ.. అందుబాటులో ఉన్న అన్ని వనరులు వినియోగించి గల్లంతైన వ్యక్తి ఆచూకీ కనిపెట్టాలని పేర్కొన్నారు. ఆయనతో పాటు పాలకొండ, వీరఘట్టం మండల రెవెన్యూ అధికారులు ఉన్నారు.

మోసం చేసిన పోస్ట్‌ మాస్టర్‌ అరెస్టు

శృంగవరపుకోట: డిపాజిట్‌దారులను మోసం చేసి సొమ్ము కాజేసిన పోస్టుమాస్టర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌.కోట సీఐ నారాయణమూర్తి చెప్పారు. ఈ మేరకు పట్టణానికి చెందిన బొమ్మిరెడ్డి పల్లి ప్రసాద్‌ ఎస్‌.కోట మండలం, టి.బొడ్డవర బ్రాంచ్‌ పోస్ట్‌మాస్టర్‌గా పనిచేస్తున్న సమయంలో కొంత మంది ఖాతాదారుల నుంచి మంత్లీ డిపాజిట్స్‌ కింద అమౌంట్‌ సేకరించారు. వారికి నకిలీ ఖాతా పుస్తకాలు ఇచ్చి విడతల వారీగా వారి దగ్గర అమౌంట్‌ సేకరించి, ఆ నగదును వారి పోస్టల్‌ ఖాతాలో జమ చేయకుండా, తన వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకుని సొమ్ము స్వాహా చేశాడు. తాము మోసపోయినట్లు గ్రహించిన ఖాతాదారులు ఎస్‌.కోట పోస్టల్‌ ఇన్‌స్పెక్టర్‌కు, ఎస్‌.కోట పోలీస్‌స్టేషన్‌ లోనూ ఫిర్యాదు చేశారు. దీంతో ప్రాథమిక దర్యాప్తు నిర్వహించిన పోలీసులు నిందితుడు ప్రసాద్‌ను బుధవారం అరెస్ట్‌ చేసి, రిమాండ్‌ నిమిత్తం కోర్టుకు తరలించినట్లు సీఐ నారాయణమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు.

వివాహిత ఆత్మహత్య

నెల్లిమర్ల: నగర పంచాయతీ పరిధిలో గల జూట్‌ మిల్లులో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఓ మహిళ బుధవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై ఎస్సై జి.గోపాలరావు అందించిన వివరాల ప్రకారం..స్థానిక గాంధీనగర్‌ కాలనీకి చెందిన నడిపిల్లి గీత (42) మధ్యాహ్నం సమయంలో తన ఇంట్లో ఉరివేసుకోవడాన్ని గమనించిన కుటుంబసభ్యులు, స్థానికులు వెంటనే స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించినప్పటికీ, అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. గీత సుమారు 20 ఏళ్లుగా జూట్‌ మిల్లులో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ఆమె భర్త శంకర్‌ కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. ఈ దంపతులకు ఒక కుమార్తె (8వ తరగతి), ఒక కుమారుడు (4వ తరగతి) ఉన్నారు. తల్లి అకస్మాత్తుగా మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.ఈ ఆత్మహత్యకు గల అసలు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం తెలుసుకున్న ఎస్సై గోపాలరావు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement