రక్తదానం చేయడం వల్ల ఏదో అయిపోతుందనే అపోహలు వీడాలి. ఆరోగ్యవంతంగా ఉండి 18 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు వారు ఎవరైనా రక్తదానం చేయవచ్చు. ప్రస్తుత తరుణంలో యువత ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గ్రామీణ ప్రాంత యువత అపోహలువీడి ఎక్కువగా రక్తదానానికి ముందుకు రావాలి. అప్పుడే రక్తం కొరతను నివారించేందుకు అవకాశం ఉంటుంది. అలాగే రక్తదానం చేయడం ద్వారా కొత్త రక్తం ఉత్పత్తి అయి ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుంది. కొత్తా సాయిప్రశాంత్‌కుమార్,
రెడ్‌క్రాస్ అధ్యక్షుడు, రాజాం


