రామతీర్థంలో వైభవంగా శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణం | - | Sakshi
Sakshi News home page

రామతీర్థంలో వైభవంగా శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణం

Sep 21 2026 12:20 AM | Updated on Sep 21 2026 12:20 AM

రామతీర్థంలో వైభవంగా శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణం

నెల్లిమర్ల రూరల్‌: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ రామస్వామి వారి దేవస్థానంలో ఈ నెల 14వ తేదీ నుంచి జరుగుతున్న శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వేకువజామున ప్రాతఃకాలార్చన, బాలభోగం, యాగశాలలో విశేష హోమాలు జరిపించారు. అనంతరం వెండి మంటపం వద్ద వేద పండితుల వేద మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల మధ్య శ్రీలక్ష్మీ సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణ వేడుక నిర్వహించారు. కల్యాణం అనంతరం శ్రీవారిని పల్లకిలో ఉంచి గ్రామంలో తీరు వీధి ఉత్సవం జరిపించారు. కార్యక్రమంలో ఈఓ వై శ్రీనివాసరావు, అర్చకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement