నాలుగో తరగతి ఉద్యోగుల సంఘానికి నూతన కార్యవర్గం | - | Sakshi
Sakshi News home page

నాలుగో తరగతి ఉద్యోగుల సంఘానికి నూతన కార్యవర్గం

Sep 21 2026 12:20 AM | Updated on Sep 21 2026 12:20 AM

నాలుగో తరగతి ఉద్యోగుల సంఘానికి నూతన కార్యవర్గం

విజయనగరం గంటస్తంభం: నాలుగో తరగతి ఉద్యోగుల సంఘానికి నూతన కార్యవర్గం ఎన్నికై ంది. ఈ మేరకు సంఘం కార్యాలయంలో ఆదివారం జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా చందక శ్రీనివాసరావు, సహాధ్యక్షుడిగా ఎం.శ్రీను, ఉపాధ్యక్షులుగా కె.సూరిబాబు, గొర్లె అర్జున్‌, కార్యదర్శిగా ఎం.మంగరాజు, సంయుక్త కార్యదర్శులుగా ఎస్‌.సుమతి, జి.లీలాకుమారి, కోశాధికారిగా టి.రామారావు, ప్రచార కార్యదర్శిగా కె.ఆనందకుమార్‌ ఎన్నికయ్యారు. ఉద్యోగుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంతో పాటు సంక్షేమం కోసం కృషి చేస్తామని నూతన కార్యవర్గ సభ్యులు తెలిపారు. ఉద్యోగుల హక్కులు, సేవా సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పనిచేస్తామన్నారు. ఎన్నికల అధికారులు శ్రీనివాసరావు, చంద్రశేఖర్‌ రవి యాదవ్‌, వై.శ్రీనివాసరావు, నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు జి.రమేష్‌, పి.మురళీప్రసాద్‌, శ్వేత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement