బాడంగి: తాగుడు వ్యసనానకి బానిసై పూర్తి జీతం ఇంటికి తేలేదని భార్య మందలిచినందుకు మనస్తాపం చెందిన ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల మేరకు తెర్లాం మండలం కూనాయవలస ఎస్సీ కాలనీకి చెందిన అలజంగి గణపతి(41) బాడంగి మండలంలోని డొంకినవలస రైల్వెస్టేషన్‌కు వెళ్లే రహదారి పక్కనగల పాత ఎఫ్‌సీఐ గిడ్డంగి వెనుక భాగంలో చీమచింతచెట్టుకు దుప్పటి కట్టుకుని ఉని వేసుకున్నాడు. గణపతి రాజాంలోని జీఎంఆర్ హాస్టల్ కుక్‌గా పనిచేస్తున్నాడని, శనివారం ఉదయం డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి వెళ్లకుండా చుట్టుపక్కల తిరుగుతూ ఆదివారం ఉదయానికి విగతజీవిగా కనిపించాడు. ఆ ప్రాంతానికి చెందిన పశువుల కాపరి చూసి విషయాన్ని గ్రామస్తులతో చెప్పగా అందులో ఒకరు సెల్‌ఫోన్‌లో ఫొటో తీసీ వాట్సాప్‌లో పెట్టగా వారి బంధువులు గుర్తించారు. మృతుడికి భార్య వెంకటలక్ష్మి, దీఫు, సమీక్ష అనే 8, 9 ఏళ్లవయస్సు కలిగిన పిల్ల లున్నారు. మృతుడి భార్య వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు ఎస్సై సూర్యకుమారి కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక సీహెచ్‌సీలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు పోలీసులు అప్పగించారు.


