విజయవాడ: విజయవాడ రూరల్ మండలం నిడమానూరులో ఆదివారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పింది. విజయవాడ నుంచి రాజాం వెళ్తున్న కనకదుర్గ ట్రావెల్స్‌కు చెందిన బస్సు అదుపు తప్పి పంట బోదెలోకి దూసుకెళ్లింది. విజయవాడలో ప్రయాణికులను ఎక్కించుకుని రాజాం వెళ్తుండగా మార్గమధ్యంలో నిడమానూరు వద్ద ఈ ప్రమాదం జరిగింది. బస్సు డ్రైవర్ నిద్ర మత్తులో అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణం చేస్తున్నారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదు అందలేదని పటమట పోలీసులు పేర్కొన్నారు.


