న్యూస్‌రీల్
సోమవారం శ్రీ 21 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
గజ ఈతగాడు గెడ్డలో పడినట్లు..!
● చిన్న శ్రీను ఎక్కే గుమ్మం.. దిగే గుమ్మం... ● అయిష్టంగానే ఆహ్వానిస్తున్న టీడీపీ నేతలు ● ఎంపీ ఇంట్లో భోజన వేళ ఇదే చర్చ
చీపురుపల్లి రూరల్: చీపురుపల్లి డివిజన్ పరిధిలోని పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ కోసం ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నట్టు డీఎల్‌డీఓ కె.హేమసుందరరావు తెలిపారు. ఎస్‌జీఎస్‌డబ్ల్యూ విభాగం ఆధ్వర్యంలో ఈ నెలలో రెండో విడత సెప్టెంబర్ – 21 నుంచి 25 వరకు ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తారని తెలిపారు. 15 నుంచి 17 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులు తప్పనిసరిగా ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ చేసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో నీట్, జేఈఈ వంటి పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అవసరమని తెలిపారు. క్యాంపులకు అవసరమైన గది, విద్యుత్, ఇంటర్నెట్, ప్రింటర్ వంటి సౌకర్యాలను పాఠశాల లు, కళాశాలల యాజమాన్యాలు కల్పించాలని ఆయన సూచించారు. విద్యార్థులు, తల్లిదండ్రు లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
● ఆరేళ్ల సర్వీసు పూర్తయిన వారికి ఏఏఎస్
పార్వతీపురం రూరల్: స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు ఉద్యోగులకు ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ (ఏఏఎస్)ను వర్తింపజేస్తూ ప్రభుత్వం జీవో నంబర్ 7 జారీ చేసింది. ఒకే పోస్టు లేదా కేడర్‌లో ఆరేళ్ల అర్హత సర్వీసు పూర్తి చేసుకున్న వారికి ఈ స్కీమ్ కింద ‘స్పెషల్ గ్రేడ్ పోస్ట్ స్కేల్’ మంజూరు చేయనున్నారు. 2019, 2020 నోటిఫికేషన్ల ద్వారా ఎంపికై న ఉద్యోగులకు 11వ పీఆర్సీ ఏఏఎస్ నిబంధనలకు లోబడి ఈ స్కేల్ అమలు కానుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై ఏపీఎన్జీవోస్ అసోసియేషన్ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు జీవీఆర్‌ఎస్ కిశోర్, కార్యదర్శి కె.రంగాచారి స్పందించారు. ఇందుకు సహకరించిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఏపీజేఏసీ చైర్మన్ అలపర్తి విద్యాసాగర్, ఏపీ ఎన్జీవోస్ ప్రధాన కార్యదర్శి డి.వి.రమణలకు వారు ఆదివారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.
రెవెన్యూ సంఘం రాష్ట్ర
సహాధ్యక్షుడిగా శ్రీరామ్మూర్తి
పార్వతీపురం రూరల్: ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సేవల సంఘం (అమరావతి) రాష్ట్ర సహాధ్యక్షుడిగా జి.శ్రీరామ్మూర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆదివారం అమరావతిలో జరిగిన సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో శ్రీరామ్మూర్తి ఏకగ్రీవ ఎన్నికను అధికారికంగా ప్రకటించారు. రాష్ట్ర సహాధ్యక్షుడిగా ఎన్నికై న ఆయనకు ఏపీ జేఏసీ పార్వతీపురం మన్యం జిల్లా నాయకులతో పాటు, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులు అభినందనలు తెలియజేశారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం :
ఇంత బతుకూ బతికి ఇంటెనక చావడం అంటే ఇదే మరి... నిన్న మొన్నటి వరకూ మంత్రులు.. ఎమ్మెల్యేలు ఎంపీలను తన గుమ్మం ముందు వెయిట్ చేయించిన చిన్న శ్రీను ఇప్పుడు కారు నిండా బొకేలు శాలువాలు పట్టుకుని టీడీపీ నాయకు లు, ఎమ్మెల్యేల గుమ్మానికి బయలు దేరుతున్నా రు. వారి ఇళ్లకు వెళ్లి తనను తాను పరిచయం చేసు కుని కొత్త చుట్టరికానికి చేతులు చాస్తున్నారు. అటువైపు నుంచి ఇష్టం లేకున్నా అయిష్టంగానే ఆహ్వానించక తప్పని పరిస్థితిలో వారు మొహం మీద నవ్వును పులుముకుని రండి.. రండి.. అంటూ ఆ ఎపిసోడ్‌ను ముగిస్తున్నారు.
గత 20 ఏళ్లుగా చిన్న శ్రీను అనుభవించిన పొలిటికల్ సెలబ్రిటీ స్టేటస్‌ను కళ్లారా చూసిన వాళ్లంతా ఔరా... పూలమ్మిన చోట కట్టెలు అమ్మడం అంటే ఇదే కదా! అని లోలోన ముక్కున వేలేసుకుంటున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా.. వైఎస్సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా.. ఆఖరుకు టీడీపీ ప్రభుత్వం ఉన్నా కానీ జిల్లాలో చిన్న శ్రీను మాటకు తిరుగుండేది కాదు. పలు సందర్భాల్లో టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు సైతం ఆయ నపై కటువైన కామెంట్లు చేస్తూ వస్తున్నారు. ఆయ న్ను రాజ్యాంగేతర శక్తి అని.. అవినీతిపరుడు అని పోరాటాలు.. ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అలాంటిది ఇప్పుడు ఎకాఎకిన ఎలా ఆహ్వానించి కౌగిలించుకుంటాం అనే ప్రశ్నలు వేస్తున్నారు.
కడుపులో కత్తులు.. కళ్లలో నవ్వులు
20 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ చిన్న శ్రీనుపై కత్తు లు నూరుతూనే ఉంది. జిల్లాపై ఆయన పెత్తనాన్ని పెద్దరికాన్ని పలు సందర్భాల్లో విమర్శిస్తూ ఆయనపై పోరాటం చేస్తూనే వచ్చింది. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్లు మంత్రులుగా ఉన్నవారు కేంద్ర మంత్రులుగా ఉన్నవారు, గవర్నర్‌గా ఉన్న వారు సైతం ఆయనను టార్గెట్ చేస్తూనే ఉండేవారు. ఇప్పుడు ఒక్కసారిగా చిన్న శ్రీనును తమలో కలుపుకోవాలి అంటే కష్టంగా ఉందని ఓ టీడీపీ నాయకుడు వ్యాఖ్యానించడం ఆయన పట్ల వారిలో ఉన్న అయిష్టతను స్పష్టం చేస్తుంది. 20 ఏళ్లుగా ఉన్న వైరం ఒక్కసారిగా ఎలా పోతుంది అంటూ తమలో తాము ప్రశ్నించుకుంటున్నారు.
పార్టీకి నాయకత్వ లోటు ఏం లేదే ?
చిన్న శ్రీనును తమలో చేర్చుకొని ఆయనకు పెద్దరి కం ఇవ్వాల్సిన అవసరం ఏమి వచ్చిందని టీడీపీ ఎమ్మెల్యేలు లోలోన గుర్రుమంటున్నారు. తమకు ఏ ఇబ్బంది లేదని, తమవైపు ఎవరూ లేకున్నా జిల్లా మొత్తాన్ని గెలిచామని గుర్తు చేస్తూ ఇప్పుడు ఆయన్ను తమ నియోజకవర్గాల్లో జోక్యం చేసుకుంటే ఎలా సహిస్తాం అని అంటున్నారు. నలభయ్యేళ్లుగా ఉన్న పార్టీ ఎన్నో సవాళ్లను ఎదుర్కొందని గు ర్తు చేస్తూ ఇప్పటికిప్పుడు చిన్న శ్రీను వచ్చి తమను ఏం ఉద్ధరిస్తారని.. ఆయన రాకతో తమకు ఉన్నఫళంగా ఏం లాభం కలుగుతుందని అంటున్నారు.
భోజన భేటీలో అప్పడాలు కరకర..
నాయకులు కొరకొర
ప్రతి నెలా ఓ ఎమ్మెల్యే ఇంట్లో భోజనం పెట్టే పేరిట ఎమ్మెల్యేలంతా కలసి కూర్చుని మాట్లాడుకోవడం టీడీపీలో ఈ మధ్య వచ్చిన కొత్త సాంప్రదాయం. ఇందులో భాగంగా తాజాగా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఇంట్లో రణస్థలంలో టీడీపీ ఎమ్మెల్యేలు.. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సైతం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చిన్న శ్రీను అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. అయితే ఆయన పెద్దరికాన్ని, తమతమ నియోజకవర్గాల్లో ఆయన జోక్యాన్ని ఏమాత్రం సహించరాదని వారంతా కూడబలుక్కుని తీర్మానించినట్లు తెలిసింది. ఆయనకు ఏ చిన్న అవకాశం ఇచ్చినా తమ ఉనికికి ముప్పు కలుగుతుందని, అందుకే ఆయన్ను దూరం పెట్టాలని వారంతా మౌఖికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఆయన చేరిక తమకు సుతరామూ ఇష్టం లేదని.. కానీ అధిష్టానం నిర్ణయాన్ని కాదనలేక సైలెంట్‌గా ఉన్నామని చెబుతూ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఆయన జోక్యం చేసుకుంటే లేనిపోని చిక్కులు.. గ్రూపు తగదాలకు ఆస్కారం కలుగుతుందని, దానికి అవకాశం ఇవ్వొద్దని వారు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.


