నేడు పీజీఆర్‌ఎస్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు పీజీఆర్‌ఎస్‌

Sep 21 2026 12:20 AM | Updated on Sep 21 2026 12:20 AM

నేడు పీజీఆర్‌ఎస్‌

విజయనగరం గంటస్తంభం: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని సత్వర పరిష్కారం చూపేందుకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి జరిగే కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులు, వినతులను సంబంధిత అధికారులకు నేరుగా అందజేయవచ్చన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సమస్యలపై పీజీఆర్‌ఎస్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

క్యూఆర్‌ కోడ్‌తో ఫీడ్‌ బ్యాక్‌

పీజీఆర్‌ఎస్‌ ద్వారా అందుతున్న సేవలు, సమస్యల పరిష్కారంపై ప్రజలు తమ అభిప్రాయాలను కూడా తెలియజేసేందుకు క్యూఆర్‌ కోడ్‌ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కలెక్టర్‌ తెలిపారు. మొబైల్‌ ఫోన్‌తో క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి పీజీఆర్‌ఎస్‌ ఫీడ్‌బ్యాక్‌ పేజీలో వివరాలు నమోదు చేసి తమ అభిప్రాయాలు, ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement