● మెజిస్ట్రేట్ ఎదుట హాజరు
చీపురుపల్లిరూరల్(గరివిడి): గరివిడి మండలంలోని కందిపేట గ్రామంలో తాను కలిసి ఉంటున్న ధనాల శ్రీనును హత్య చేసిన కేసుకు సంబంధించి నిందితురాలు రాములమ్మను పోలీసులు అరెస్టు చేశారు. కందిపేట గ్రామంలో కలిసి జీవనం సాగిస్తున్న ధనాల శ్రీనుపై ఈనెల 16న రాములమ్మ దాడి చేసి సిమెంట్ దిమ్మెతో తలపై కొటి హత్య చేసిన సంఘటన విదితమే. మృతుడు శ్రీను తండ్రి చిన్న అప్పారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ జి.శంకరరావు కేసు దర్యాప్తు చేసి నిందితురాలు రాములమ్మను శనివారం అరెస్టు చేసి చీపురుపల్లి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచినట్లు ఎస్సై బి.లోకేశ్వరరావు తెలిపారు.
సుందరాకాండ
లోకకల్యాణానికి శుభప్రదం
రేగిడి: సుందరాకాండ చదివినా విన్నా లోకకల్యాణానికి ఎంతో మంచిదని గుంటూరు జిల్లా నంబూరు శ్రీకాళీ వనాశ్రమ పీఠాధిపతి శ్రీనివాస రామానుజదాస్ అన్నారు. ఈ మేరకు రేగిడి దత్తపీఠంలో గణపతి నవరాత్రులను పురస్కరించుకుని సుందరకాండ ప్రవచనాలను శనివారం ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరామానుజదాస్ మాట్లాడుతూ హనుమాన్‌చాలీసా, సుందరాకాండ వంటి ప్రవచనాలను ప్రతిరోజూ రామమందిరాలు, ఆంజనేయస్వామి ఆలయాల్లో ప్రవచనం చేస్తే ప్రజలంతా సుఖసంతోషాలతో ఉంటారన్నారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.


