ప్రైవేట్‌ వృత్తి విద్య జూనియర్‌ కళాశాలల సంఘం జిల్లా కమిటీ ఏకగ్రీవం | - | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ వృత్తి విద్య జూనియర్‌ కళాశాలల సంఘం జిల్లా కమిటీ ఏకగ్రీవం

Sep 20 2026 12:15 AM | Updated on Sep 20 2026 12:15 AM

ప్రైవేట్‌ వృత్తి విద్య జూనియర్‌ కళాశాలల సంఘం జిల్లా కమిటీ ఏకగ్రీవం

విజయనగరం అర్బన్‌: జిల్లాలోని ప్రైవేట్‌ ఒకేషనల్‌ జూనియర్‌ కాలేజీల అసోసియేషన్‌ జిల్లా కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ద్వారపూడిలోని సెయింట్‌ థామస్‌ ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాలలో శనివారం నిర్వహించిన సమావేశంలో జిల్లాలోని కళాశాలల కరస్పాండెంట్లు పాల్గొని నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా పి.ప్రకాశరావు (ఎస్‌ఎస్‌పీ, విజయనగరం), ఉపాధ్యక్షుడిగా పి.శ్రీను (సాయిరాం–బొబ్బిలి), కార్యదర్శిగా జె.కృష్ణ (ఎస్‌వీఎన్‌, ఎస్‌.కోట), సంయుక్త కార్యదర్శిగా శ్రీనివాసరావు (న్యూటన్‌, పెద్దమానాపురం), కోశాధికారిగా ఎం.గోవింద్‌ (శ్రీసూర్య, భీమసింగి) ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా జగన్నాథం (గోస్తనీ, జామి), ఎ.రమేష్‌ (ఏవీఎన్‌, ఎస్‌.కోట), బి.తిరుపతి (గణేష్‌, బొబ్బిలి)లను ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల ప్రక్రియకు పార్వతీపురం జిల్లా అధ్యక్షుడు వి.జగదీశ్వరరావు (వెంకటేశ్వర, సాలూరు) ప్రొసీడింగ్‌ ఆఫీసర్‌గా వ్యవహరించారు. సంఘం చీఫ్‌ ప్యాట్రన్లుగా వి.జగదీశ్వరరావు, పి.జాన్‌ (సెయింట్‌ థామస్‌, ద్వారపూడి)లను నియమించారు. అనంతరం నూతన కమిటీ బాధ్యతలు తీసుకుని ప్రమాణ స్వీకారం చేపట్టారు. కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా నుంచి ఎం.స్వాత్విక్‌ (వేదశ్రీ, పార్వతీపురం), డి.చిన్నంనాయుడు (శారద, గుమ్మలక్ష్మీపురం)తోపాటు పలువురు కళాశాల కరస్పాండెంట్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement