బొండపల్లి: జిల్లావ్యాప్తంగా 51,644 మంది సామాజిక పింఛన్ల కోసం సచివాలయాల్లో అన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నట్లు డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస్ పాణి తెలిపారు. ఈ మేరకు బొండపల్లి మండల పరిషత్ కార్యాలయాన్ని శనివారం సందర్శించిన అయన విలేకరులతో సామాజిక భద్రత పింఛన్లపై మాట్లాడుతూ సచివాలయాల ద్వారా వచ్చిన దరఖాస్తుల న్నింటిని ఈనెల 21 వ తేదీలోగా పరిశీలించి అర్హత గల వారిని ఎంపిక చేసి పింఛన్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రకియ అంతా ఈ నెలలోనే పూర్తి చేసి అక్టోబరు 1న కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ పింఛన్లు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. వచ్చిన దరఖాస్తులను సచివాలయం వెల్పేర్ సహయకులతో పాటు ఎంపీడీఓలు, తహసీల్దార్‌లు, వివిధ శాఖలకు చెందిన అయా అధికారులు పరిశీలించి అర్హత ఉన్న వారిని గుర్తించి ఎంపీడీఓ లాగిన్‌లోకి వివరాలు పంపించనున్నట్లు చెప్పారు. అన్ని అర్హతలు ఉన్న వారికి పింఛన్లు మంజూరు చేసే పక్రియను డీఆర్‌డీఏ ద్వారా చేపడుతూ అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ అరసాడ రఘుపతిరావు, డిప్యూటీ ఎంపీడీఓ జి.జనార్దనరావు తదితరులు పాల్గొన్నారు.
డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్ పాణి


