పట్టణంలో జరుగుతున్న మోసాలపై చిరు, వ్యాపారులు, టెంట్‌హౌస్ నిర్వాహకులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఇటీవల అన్నదానం పేరుతో నకిలీ ఆర్డర్లు ఇచ్చి వ్యాపారులను ముంచేస్తున్న ఘరానా మోసగాళ్ల పట్ల వ్యాపారులు సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. ప్రతి వ్యాపారి తమ షాపు వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి. దీని వల్ల అనుమానాస్పద వ్యక్తుల కదలికలు రికార్డ్ అవుతాయి. ఆర్డర్ ఇచ్చే గుర్తు తెలియని వ్యక్తుల వద్ద ఆధార్‌కార్డు, ఫోన్ నంబర్‌ను తప్పనిసరిగా తీసుకోవాలి. అక్కడికక్కడే కాల్ రింగ్ చేసి కన్ఫామ్ చేసుకోవాలి. ఏదైనా మోసం జరిగినట్లు గుర్తిస్తే వెంటనే 100/112కి డయల్ చేసి ఫిర్యాదు చేయాలి. – టి.శ్రీనివాసరావు,
టూటౌన్ సీఐ, విజయనగరం


