ఆటో ప్రమాదంలో పలువురికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

ఆటో ప్రమాదంలో పలువురికి గాయాలు

Sep 19 2026 8:44 AM | Updated on Sep 19 2026 8:44 AM

కురుపాం:/జియ్యమ్మ వలస రూరల్‌: జియ్యమ్మవలస మండలంలోని జోగిరాజుపేట సమీపంలో శుక్రవారం ఆటో, స్కూటీ ఢీ కొన్న ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. పార్వతీపురం నుంచి కురుపాం వస్తున్న ఆటో, కురుపాం నుంచి పార్వతీపురం వెళ్తున్న స్కూటీ ఎదురెదురుగా బలంగా ఢీ కొట్టుకొని బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జియ్యమ్మవలస మండలం నిమ్మలపాడుగ్రామానికి చెందిన మండంగి పొట్ట య్య, కురుపాం మండలం పట్టాయిదొరవలస గ్రామానికి చెందిన ఇ.కామేశ్వరరావులను కురుపాం సామాజిక ఆరోగ్యకేంద్రానికి తరలించా రు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యసేవల కోసం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు.అలాగే ఈ ప్రమాదంలో స్వల్పగాయలైన గంట అప్పలనాయుడు, డి.సోమినాయుడు లను ప్రథమ చికిత్స అనంతరం డిశ్చార్జ్‌ చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

రామభద్రపురం: మండలంలోని బూసాయవలసలో మద్యానికి బానిసైన ఓ వ్యక్తి గడ్డి మందు తాగి శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఉమ్మిరెడ్డి రామారావు(60)కు మద్యం తాగే అలవాటు ఉంది.రోజూ విపరీతంగా మద్యం తాగుతూ ఉండేవాడు. మద్యం తాగి ఆరోగ్యం పాడుచేసుకోవడమెందుకని భార్య భారతి మందలించింది.ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన రామారావు గడ్డిమందు తాగేశాడు. అనంతరం ఓ తోటలో వాంతులు చేసుకుంటూ సొంగలు కక్కుతుండగా స్థానికులు చూసి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. వెంటనే కుటుంబసభ్యులు ప్రథమ చికిత్ప నిమిత్తం 108లో బాడంగి సీహెచ్‌సీకి తరలించారు. ఆరోగ్యం విషమించడంతో మెరుగైన వైద్యం నిమిత్తం విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.భార్య భారతి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ జ్ఞానప్రసాద్‌ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తల్లిదండ్రులకు బాలిక అప్పగింత

తుని: ఇంటిలో ఎవరికీ చెప్పకుండా రైలులో వచ్చిన విజయనగరం జిల్లా మెంటాడ మండలం చల్లపల్లి గ్రామానికి చెందిన ఏడిబిల్లి భానును తుని జీఆర్పీ సిబ్బంది ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ మేరకు శుక్రవారం జీఆర్పీ హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు భాను విజయనగరం నుంచి విశాఖ రైల్వేస్టేషన్‌కు చేరుకుని అక్కడ కడప వెళ్లే తిరుమల ఎక్స్‌ప్రెస్‌ ఎక్కి జనరల్‌ బోగీలో కూర్చుంది. బెదురు చూపులు చూస్తున్న ఆమె గురించి ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు ఆమెను కాకినాడ జిల్లా తునిలో దించి రైల్వే పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లి సమాచారం సేకరించారు. బాలిక తల్లి జానకి ఏఎన్‌ఎంగా పని చేస్తున్నట్లు గుర్తించి ఆండ్ర పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చి తుని వచ్చిన తల్లిదండ్రులు, బంధువుల సమక్షంలో బాలికను అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement