26న జేఎన్‌టీయూ జీవీలో మెగా జాబ్‌ డ్రైవ్‌ | - | Sakshi
Sakshi News home page

26న జేఎన్‌టీయూ జీవీలో మెగా జాబ్‌ డ్రైవ్‌

Sep 19 2026 8:44 AM | Updated on Sep 19 2026 8:44 AM

26న జేఎన్‌టీయూ జీవీలో మెగా జాబ్‌ డ్రైవ్‌

విజయనగరం రూరల్‌: జేఎన్‌టీయూ–జీవీలో ఈ నెల 26న నిర్వహించనున్న మెగా జాబ్‌ డ్రైవ్‌ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జేఎన్‌టీయూ–జీవీ ఉపకులపతి వి.వి.సుబ్బారావు శుక్రవారం తెలిపారు. జేఎన్‌టీయూ–జీవీ, నిర్మాణ్‌ ఆర్గనైజేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో మెగా జాబ్‌ డ్రైవ్‌ ఈ నెల 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నట్లు వీసీ తెలిపారు. ఈ జాబ్‌ మేళాలో 2023 నుంచి ప్రస్తుత విద్యా సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు పాల్గొనవచ్చని తెలిపారు. మెకానికల్‌, ఈసీఈ, ఈఈఈ, ఆటోమొబైల్‌, ఇండస్ట్రియల్‌ ప్రొడక్షన్‌, అనుబంధ కోర్‌ బ్రాంచిలకు చెందిన బీటెక్‌, డిప్లమో, ఐటీఐ అభ్యర్థులతో పాటు బి.ఫార్మశీ, బీఎస్సీ కెమిస్ట్రీ, ఇతర గ్రాడ్యుయేట్లకు అవకాశాలు లబిస్తాయన్నారు. ఈ జాబ్‌ డ్రైవ్‌కు విప్రో ఇన్‌ఫ్రాస్టక్చర్‌, మేథా సర్వో, టీవీఎస్‌ సుందరం, గ్రీన్‌ టెక్‌ ఇండస్ట్రీస్‌, ఎంఆర్‌ఎఫ్‌ టైర్స్‌, టెక్‌ మహీంద్రా, సదర్‌లాండ్‌, కాన్‌సన్‌ట్రిక్స్‌, డిల్పి టీవీఎస్‌, కియా, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, ఇసుజు, హూందై, సీఐఈ ఆటోమోటివ్‌, కేఎస్‌హెచ్‌ ఇంటర్నేషనల్‌ సంస్థలు హాజరవుతాయని తెలిపారు. ఈ సందర్భంగా జాబ్‌ డ్రైవ్‌కు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. జాబ్‌ డ్రైవ్‌కు హాజరయ్యే అభ్యర్థులు పాస్‌పోర్టు సైజు ఫొటో, రెజ్యూమె, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌, పాన్‌కార్డు జిరాక్స్‌ కాపీలు తీసుకురావాలని నిర్వాహకులు తెలిపారు. మరిన్ని వివరాలకు ఫోన్‌ 9985219897 (రవివర్మ), 9642193019 (ప్రవీణ్‌), 9866894969 (మహేష్‌)నంబర్లను సంప్రదించాలని సూచించారు. రిజిస్ట్రేషన్‌ కోసం క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయాలన్నారు. కార్యక్రమంలో జేఎన్‌టీయూ జీవీ రిజిస్ట్రార్‌ కేసీబీ రావు, పరిశ్రమల, ప్లేస్‌మెంట్‌ డైరెక్టర్‌ కె.శ్రీకుమార్‌, టీపీవో డాక్టర్‌ పి.శ్రీదేవి, నిర్మాణ్‌ ఆర్గనైజేషన్‌ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement