ఆరిపోయిన ఆశల దీపం | - | Sakshi
Sakshi News home page

ఆరిపోయిన ఆశల దీపం

Sep 18 2026 12:51 AM | Updated on Sep 18 2026 12:51 AM

ఆరిపోయిన ఆశల దీపం ● ఎదిగి వస్తాడనుకున్న కొడుకు మరణంతో కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు ● పాఠశాల గదిలో అపస్మారక స్థితిలో విద్యార్థి గుర్తింపు ● ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి ● ఏకలవ్య పాఠశాలలో విషాదం ● విధుల్లో నిర్లక్ష్యంపై ప్రిన్సిపాల్‌ సస్పెన్షన్‌, వార్డెన్‌ తొలగింపు విద్యార్థి కుటుంబానికి ఐటీడీఏ హామీ

రూ.5 లక్షల పరిహారం,

ఉద్యోగానికి

ప్రయత్నం

● ఎదిగి వస్తాడనుకున్న కొడుకు మరణంతో కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు ● పాఠశాల గదిలో అపస్మారక స్థితిలో విద్యార్థి గుర్తింపు ● ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి ● ఏకలవ్య పాఠశాలలో విషాదం ● విధుల్లో నిర్లక్ష్యంపై ప్రిన్సిపాల్‌ సస్పెన్షన్‌, వార్డెన్‌ తొలగింపు
విద్యార్థి కుటుంబానికి ఐటీడీఏ హామీ

పార్వతీపురం రూరల్‌ /మక్కువ:

క్కగా చదువుకుంటూ అన్ని రంగాల్లో ముందుండే ఆ పసివా డు అనంత లోకాలకు పయనమయ్యాడు. ఎదిగి వచ్చి ఇంటికి పెద్ద దిక్కు అవుతాడనుకున్న ఆ తల్లిదండ్రుల ఆశలు అర్థాంతరంగా ఆవిరయ్యాయి. ‘ఏం కష్టమొచ్చింది నాన్నా.. ఎవరితో చెప్పుకోలేక ఎందుకిలా చేశావ్‌ అసలు ఏమైంది అంటూ’ ఆ కన్నవారు కుమిలిపోతున్న తీరు చూపరులను కలిచి వేసింది. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం అనసభద్ర ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న సవర అర్పిత్‌ (12) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన తీవ్ర విషాదం నింపింది. గురువారం ఉదయం తరగతి గదిలో అర్పిత్‌ అపస్మారక స్థితిలో ఉండడాన్ని గమనించిన పాఠశాల సిబ్బంది.. హుటాహుటిన డోకిశీల పీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి పార్వతీపురం కేంద్రాస్పత్రికి ఆస్పత్రికి తీసుకెళ్తుండగా..మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచినట్లు వైద్యులు నిర్ధారించారు. సీతంపేట మండలంలోని ఎర్రన్నగూడకు చెందిన రాంబా బు, చామంతి దంపతులకు ఇద్దరు కుమార్తెల తర్వాత పుట్టిన అర్పిత్‌ మరణవార్త విని ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కాగా, ఎప్పుడూ చలాకీగా ఉండే అర్పిత్‌.. ఉరి వేసుకుని చనిపోతానని ఉదయం తనతో చెప్పిన ట్లు స్నేహితుడు హర్షవర్దన్‌ తెలపగా, ఇంటికి వెళ్లిపోతానని గతంలో చెప్పినట్లు మరో విద్యార్థి లోకేష్‌ వెల్లడించాడు. అప్పుడప్పుడు ఆటపట్టిస్తుంటాడని భావించిన తోటి విద్యార్థులు ఈ ఊహించని సంఘటనతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. విద్యార్థి మృతి ఘటనపై అధికారులు తీవ్రంగా స్పందించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు చేపట్టింది. పాలనాపరమైన వైఫల్యాలకు బాధ్యుడ్ని చేస్తూ.. అనసభద్ర ఈఎంఆర్‌ఎస్‌ ప్రిన్సిపాల్‌ కె.సురేష్‌పై తక్షణమే సస్పెన్షన్‌ విధిస్తూ ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ (ఏపీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశా రు. సస్పెన్షనన్‌కు గురైన ప్రిన్సిపాల్‌ తాడేపల్లి ప్రధాన కార్యాలయానికి రిపోర్ట్‌ చేయాలని ఆదేశించగా, సీనియర్‌ పీజీటీకి తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. విద్యార్థి మృతికి దారితీసిన పరిస్థితుల నేపథ్యంలో హాస్టల్‌ వార్డెన్‌ (అతిథి అధ్యాపకుడు)ఎ.మహేశ్వరరావును విధుల నుంచి తొలగిస్తూ తక్షణ ఆదేశాలు అమలు చేశారు.

బందోబస్తు నిర్వహించిన పోలీసులు

ఈ ఘటన సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు, కుటుంబసభ్యులు భారీగా ఆటోల్లో జిల్లా ఆస్పత్రికి చేరుకుంటున్న నేపథ్యంలో.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆస్పత్రికి ముందుగా చేరుకున్న ఉత్తరాంధ్ర గిరిజన సంక్షేమ నాయకుడు పాలక రంజిత్‌ కుమార్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు తహసీల్దార్‌ భానుప్రసాద్‌ పాఠశాలకు చేరుకుని ఏడో తరగతి విద్యార్థులతో మాట్లాడి వివరాలు సేకరించారు. జిల్లా అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు పాఠశాలను సందర్శించి దర్యాప్తు ముమ్మరం చేశారు. విద్యార్థి ఉరి వేసుకున్నట్లుగా భావిస్తున్న గది కిటికీని ఏఎస్సై శ్రీనివాసరావు పరిశీలించగా, క్లూస్‌ టీమ్‌ ఆ గదిని తమ ఆధీనంలోకి తీసుకుని కీలక ఆధారాలు సేకరిస్తోంది.

పార్వతీపురం రూరల్‌: మక్కువ మండలంలోని అనసభద్ర ఏకలవ్య పాఠశాలలో గురువారం ఏడో తరగతి విద్యార్థి అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఘటనపై సమాచారం అందుకు న్న వెంటనే ఐటీడీఏ ఏపీవో ప్రభాకరరావు కేంద్రాస్పత్రికి చేరుకున్నారు. అక్కడ మృతుడి తల్లి దండ్రులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి ఆయన ప్రభుత్వం తరఫున కీలక హామీలు ఇచ్చారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి రూ.5 లక్షల వరకు నష్టపరిహారం అందజేస్తామని ఏపీవో స్పష్టం చేశారు. దీనికి తోడు, ఆ కుటుంబసభ్యుల్లో ఒకరికి ఔట్‌సోర్సింగ్‌ విధానంలో ఉద్యోగం కల్పిస్తామని భరోసా ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement