మత్స్య సంపద అభివృద్ధికి చర్యలు | - | Sakshi
Sakshi News home page

మత్స్య సంపద అభివృద్ధికి చర్యలు

Sep 18 2026 12:51 AM | Updated on Sep 18 2026 12:51 AM

కలెక్టర్‌ రాంసుందర్‌ రెడ్డి

విజయనగరం ఫోర్ట్‌: జిల్లాలో మత్స్య సంపద ఉత్పత్తిని పెంచేందుకు శాసీ్త్రయ పద్ధతుల్లో సమగ్ర చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. తన చాంబర్‌ నుంచి ఆన్‌లైన్‌లో సంబంధిత అధికారులతో గురువారం మాట్లాడారు. 2026–27 సంవత్సరానికి పీఎంఎంఎస్‌ వై ఫేజ్‌–2 కకింద రిజర్వాయర్ల సమగ్రాభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలన్నారు. ఈ పధకం కిం కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 నిధులవాటాతో రిజర్వాయర్‌ పరిమాణాన్ని బట్టి నిధులు కేటాయిస్తుందన్నారు. మత్స్యకారులకు సీడ్‌ లింక్స్‌, ఆటోలు, మోటార్‌ సైకిళ్లు, ఐస్‌ బాక్సులు అందజేస్తారన్నారు. సమావేశంలో మత్స్యశాఖ డీడీ లావణ్య పాల్గొన్నారు.

పోస్టుల కేటాయింపుపై స్పష్టత ఇవ్వండి

గిరిజన ఉపాధ్యాయుల విభజన పారదర్శకంగా చేపట్టాలి

ఐటీడీఏ అధికారులకు యూటీఎఫ్‌ డిమాండ్‌

పార్వతీపురం రూరల్‌: ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల విభజన ప్రక్రియను ఎటువంటి లోపాలకు తావులేకుండా, అత్యంత పారదర్శకంగా చేపట్టాలని యూటీఎఫ్‌ డిమాండ్‌ చేసింది. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన సాగుతున్న ఈ ప్రక్రియలో.. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు విజయనగరం, పార్వతీపురం జిల్లాలకు కేటాయించిన పోస్టుల వివరాలను వెల్లడించాలని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.మురళీమోహన్‌రావు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.కృష్ణారావు, కె.భాస్కరరావు కోరారు. ఎస్సీ, ఎస్టీ కేటగిరీల వారీగా ఏ జిల్లాకు ఎంతమందిని కేటాయిస్తున్నారో స్పష్టం చేయడంతో పాటు, తక్షణమే ఖాళీల జాబితాను బహిర్గతం చేయాలని వారు డిమాండ్‌ చేశారు. విభజన విషయంలో ఐటీడీఏ అధికారులు ఉపాధ్యాయులకు ఒకలా, సంఘాలకు మరోలా పొంతనలేని సమాచారం ఇస్తున్నారని వారు పేర్కొన్నారు. ఈ గందరగోళానికి తెరదించుతూ.. కేవలం ప్రొవిజనల్‌, ఫైనల్‌ సీనియార్టీ జాబితాల ఆధారంగానే కౌన్సెలింగ్‌ ప్రక్రియ సజావుగా సాగేలా ప్రాజెక్టు అధికారి (పీవో) కచ్చితమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉపాధ్యాయ సంఘాలతో తక్షణమే అధికారిక సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు.

రాష్ట్ర స్థాయి సైన్స్‌ సెమినార్‌ పోటీలకు ఇద్దరు ఎంపిక

విజయనగరం అర్బన్‌: జాతీయ సైన్స్‌ సెమినార్‌–2026లో భాగంగా రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా నుంచి ఇద్దరు విద్యార్థులు ఎంపికై నట్టు డీఈఓ యు.మాణిక్యంనాయుడు తెలిపారు. దాసన్నపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ‘ఇండియన్‌ ఎనర్జీ బాస్కెట్‌–2047’ అనే అంశంపై గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో జిల్లాలోని వివిధ పాఠశాలకు చెందిన 47 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వారంతా తమ ఆలోచనలు, పరిశోధనలు, భవిష్యత్‌ దృక్పఽథాలను వెల్లడించారు. ఈ పోటీలో వేపాడ మండలం బక్కునాయుడుపేట ఏపీఎంఎస్‌పాఠశాలకు చెందిన ఎం.అరవింద్‌ ప్రథమ స్థానంలో నిలవగా, చీపురుపల్లి కేజీబీవీ విద్యార్థిని ఐ.మాధవి ద్వితీయ స్థానాన్ని సాధించారు. వీరిద్దరూ విజయవాడలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఎంపికై న విద్యార్థులను డీఈఓ మాణిక్యంనాయుడు అభినందించారు. పోటీల జ్యూరీ సభ్యులుగా పి.వెంకటనాయుడు, ఎం.హరిబాబు వ్యవహరించగా, నిర్వహణలో సైన్స్‌ కోఆర్డినేటర్‌ టి.రాజేష్‌, డీఏసీ జి.సన్యాసినాయుడు, ఎస్‌ఆర్‌పీ ఎ.సురేంద్రనాథ్‌ పాల్గొన్నారు.

30న యువజనోత్సవాలు

విజయనగరం: జిల్లా స్థాయి యువజనోత్సవాలు–2026ను ఈ నెల 30న నిర్వహించనున్నట్టు సెట్విజ్‌ సీఈఓ వి.వి.అప్పలనాయుడు తెలిపారు. విజయనగరం పట్టణంలోని మహారాజా అటానమస్‌ కళాశాల(కోట)లో ఉదయం 9 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. 15 నుంచి 29 ఏళ్లలోపు యువతీ యువకులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. జానపద నృత్యాలు, జానపద గీతాలు, వీధి నాటకం, కవితా రచన, చిత్రలేఖనం విభాగాల్లో పోటీలు నిర్వహిస్తామన్నారు. ఆసక్తి ఉన్నవారు ఆధార్‌ జిరాక్స్‌, వయసు ధ్రువీకరణ పత్రం, పాస్‌ఫొటో తీసుకురావాలన్నారు. జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన వారికి రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తారని, వివరాలకు సెల్‌: 94943 34044 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement