● కోటలో నిరసన గళం | - | Sakshi
Sakshi News home page

● కోటలో నిరసన గళం

Aug 11 2026 1:54 AM | Updated on Aug 11 2026 1:54 AM

డీఎస్సీ అక్రమాలపై నిగ్గుతేల్చాలంటూ ఎస్‌.కోట ఆర్టీసీ కాంప్లెక్స్‌ కూడలిలో మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు నేతృత్వంలో నిరసన సభ, ర్యాలీ నిర్వహించారు. దేవీ కూడలి వరకు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించగా సీఐ నారాయణమూర్తి నేతృత్వంలోని పోలీసు బలగాలు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. శాంతియుతంగా చేపట్టే ర్యాలీని అడ్డుకునేలా సర్కారు పెట్టిన ఆంక్షలపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ పరిశీలకురాలు కె.భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే శోభ హైమావతి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement