లారీ బీభత్సం | - | Sakshi
Sakshi News home page

లారీ బీభత్సం

Aug 8 2026 1:05 AM | Updated on Aug 8 2026 1:05 AM

మూడు విద్యుత్‌ స్తంభాలు,

ట్రాన్స్‌ఫార్మర్‌, బైక్‌ ధ్వంసం

భామిని: రోడ్డుపై వాహనాల రాకపోకలు, పొలాల్లో వ్యవసాయ పనుల్లో రైతులు, వరితీతలో వలస కూలీలు. అందరూ చూస్తుండగానే శుక్రవారం ఓ లారీ బీభత్సం సృష్టించింది.భామిని మండలం నేరడి బ్యారేజీ సమీపంలో ఏబీ రోడ్డుపై బత్తిలి నుంచి భామిని వైపు వస్తున్న సిమెంట్‌ బస్తాల ఖాళీ లారీ రోడ్డుపై కుడివైపు మితిమీరిన వేగంతో వస్తూ రోడ్డు సైడ్‌న ఆపి ఉన్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొని ఈడ్చుకుంటూ వెళ్లి కొత్తగా వేసిన భారీ రౌండ్‌ విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. అనంతరం రోడ్డుపక్కనే ఉన్న రెండు విద్యుత్‌ స్తంభాలపై గల పాత ట్రాన్స్‌ఫార్మర్‌ను పడగొట్టింది. ఆ సమయంలో విద్యుత్‌ సరఫరా లేక పోవడంతో ప్రాణనష్టం తప్పిందని పొలంలో పనిచేస్తున్న అంతా ఊపిరిపీల్చుకున్నారు. రోడ్డుపక్కనే బైక్‌ను నిలిని పొలం పనులు చేస్తున్న నేరడికి చెందిన రైతు పాతపట్నం కోదండ రావు బైక్‌ ప్రమాదంలో తునాతునకలైంది. కొద్ది దూరంలో పోలంలోని రైతులు కేకలు వేయడంతో ప్రమాదానికి కారణమైన లారీ నిలిపివేసి డ్రైవర్‌ పరుగులు తీశాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

జనసేన నాయకుడిపై దాడి

విజయనగరం రూరల్‌: నగరానికి చెందిన జనసేన నాయకుడు గురాన అయ్యలుపై కొంతమంది వ్యక్తులు దాడి చేశారు. నగరంలోని మంగలివీధిలో ఉన్న నూకాలమ్మ ఆలయానికి సంబంధించి జనసేన నేతకు, స్థానికుల మధ్య నెలకొన్న పాత గొడవల నేపథ్యంలో ఇరువర్గాల మధ్య శుక్రవారం జరిగిన వాగ్వాదం కొట్లాటకు దారితీసింది. దీంతో స్థానికులు కొందరు అయ్యలుపై దాడి చేసి గాయపరిచారు. దీంతో ఆయన జిల్లా కేంద్రాస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నారు. దాడి విషయంపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement