దుప్పాడలోని భూమి దేవదాయ శాఖదే | - | Sakshi
Sakshi News home page

దుప్పాడలోని భూమి దేవదాయ శాఖదే

Aug 6 2026 2:08 AM | Updated on Aug 6 2026 2:08 AM

దుప్పాడలోని భూమి దేవదాయ శాఖదే

ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు

అసిస్టెంట్‌ కమిషనర్‌ శిరీష హెచ్చరిక

విజయనగరం క్రైమ్‌: మండల పరిధిలోని దుప్పాడలో ఉన్న 4 ఎకరాల 62 సెంట్ల భూమి దేవదాయ శాఖకు చెందిందని దేవదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్‌ శిరీష బుధవారం స్పష్టం చేశారు. సదరు భూమిని కొందరు కంచె వేసి ఆక్రమించుకున్నారని ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఫిర్యాదు రావడంతో, కలెక్టర్‌ ఆదేశాల మేరకు వన్‌ టౌన్‌ పోలీసుల సహాయంతో ఆ స్థలాన్ని నేరుగా పరిశీలించినట్లు ఆమె తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఈ స్థలం దుప్పాడ గ్రామస్తుల సంక్షేమానికి ఉద్దేశించినదని, గ్రామస్తులు మినహా వేరెవరైనా ఈ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆక్రమణలను తొలగించి, సదరు స్థలంలో రామాలయం నిర్మించాలని దుప్పాడ గ్రామస్తులు నిర్ణయించారని.. వారి నిర్ణయానికి అనుగుణంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement