విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు | - | Sakshi
Sakshi News home page

విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు

Aug 6 2026 1:09 AM | Updated on Aug 6 2026 1:09 AM

సైనిక పాఠశాల ప్రిన్సిపాల్‌ కెప్టెన్‌ ఎస్‌ఎస్‌ శాస్త్రి

విజయనగరం రూరల్‌: విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని కోరుకొండ సైనిక పాఠశాల ప్రిన్సిపాల్‌ కెప్టెన్‌ ఎస్‌.ఎస్‌.శాస్త్రి అన్నారు. పాఠశాల ఇన్వెస్టిచర్‌ మహోత్సవాన్ని సైనిక పాఠశాలలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని వివిధ హౌస్‌లకు విద్యార్థి నాయకుల నియామకాలను చేపట్టి, వారికి ర్యాంక్‌ బ్యాడ్జీలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్ధేశించి మాట్లాడు తూ.. క్రమశిక్షణ, అంకితభావం, నిబద్ధతతోనే ఉన్నత స్థాయికి చేరుకోగలమన్నారు. ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలిచి తమ నాయకత్వ పటిమను పెంపొందించుకోవాలన్నారు. అనంతరం పాఠశాల వార్షిక మ్యాగజైన్‌ ‘సైకోరియన్‌’ను ప్రిన్సిపాల్‌తో పాటు ఆయన సతీమణి రిచాశాస్త్రి ఆవిష్కరించారు. అలాగే 2025 – 26 సంవత్సరానికి ఎన్‌డీఏ ట్రోఫీని గజపతి హౌస్‌కు అందించగా, మొఘల్‌ హౌస్‌ చాంపియన్స్‌ ఆఫ్‌ ఛాంపియన్స్‌ కాక్‌ హౌస్‌ బ్యానర్‌ను కై వసం చేసుకోగా, హౌస్‌మాస్టర్‌ కేవీ రవికుమార్‌కు ట్రోఫీని అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

ఎల్‌ఐసీ ఉద్యోగుల నిరసన

విజయనగరం క్రైమ్‌: లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ)లో కేంద్ర ప్రభుత్వం తన వాటాలను మరింత విక్రయించాలని తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (ఎల్‌ఐసీఈయూ) ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసన తెలిపారు. బుధవారం స్థానిక ట్యాంక్‌ బండ్‌ రోడ్డులోని ఎల్‌ఐసీ కార్యాలయం వద్ద లంచ్‌ అవర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సుమారు 30 మంది ఉద్యోగులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ నాయకుడు శరత్‌కుమార్‌ మాట్లాడుతూ.. ఈ నెల 3న కేంద్ర ప్రభుత్వం ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా ఎల్‌ఐసీ ఈక్విటీలో 2.5 శాతం వాటాలను విక్రయిస్తామని ప్రకటించిందని తెలిపారు. దీని ప్రకారం మొత్తం విక్రయం విలువ 6.5 శాతానికి చేరుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగాలను బలోపేతం చేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇలా చేయడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ప్రైవేటీకరణ విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement