ఈ చిత్రం చూశారా.. ఎరువుల కోసం రైతుల కష్టాలకు రేగిడి మండలం సంకిలి సచివాలయం వద్ద శుక్రవారం కనిపించిన ఈ చిత్రమే నిలువెత్తు సాక్ష్యం. ఖరీఫ్ ఆరంభంలోనే రైతులు బస్తా యూరియా కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది. సచివాలయంలో యూరియా విక్రయిస్తారన్న సమాచారంతో సంకిలి, బొడ్డవలస, చిన్నయ్యపేట, అప్పాపురం, మజ్జిరాముడుపేట, తదితర గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఎరువుల పంపిణీలో ‘యాప్’సోపాలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. బస్తా యూరియా కోసం ఆధార్‌కార్డులు, సెల్‌ఫోన్లు పట్టుకుని తిరగాలా? అంటూ వ్యవసాయ సిబ్బందిని నిలదీశారు. ఆందోళనకు దిగారు. దీంతో పోలీసుల సమక్షంలో రోజుకు 30 మంది చొప్పున స్లిప్‌లు పంపిణీ చేసి యూరియా విక్రయానికి ఏర్పాట్లు చేశారు. – రేగిడి


