
తాగునీటి పథకాల క్లోరినేషన్ జరగాలి
పార్వతీపురంటౌన్: జిల్లాలో తాగునీటి ఎద్దడి లేకుండా విస్తత చర్యలు చేపట్టాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అధికారులను ఆదేశించారు. వివిధ పత్రికల్లో తాగునీటి సమస్యపై వచ్చిన వార్తలపై కలెక్టర్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ వేసవి తీవ్రత దష్ట్యా అధికారులు స్పష్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. తాగునీటి పథకాలను ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేయాలని, తాగునీటి పరీక్షలు నిర్వహిం చాలని ఆదేశించారు. తాగునీటి పథకాలకు మెట్లు లేకపోతే తక్షణం మెట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. తాగునీటి సమస్య ఏర్పడినప్పుడు వెంటనే పనులు చేపట్టాలని కోరారు. జిల్లా పరిషత్ నిధులు మంజూరు కానున్నట్లు పేర్కొన్నారు. పార్వతీపురం, సాలూరు మున్సిపాలిటీలు, వీరఘట్ట, సీతంపేట తదితర మండలాల నుంచి తాగునీటి సమస్యపై వచ్చిన అంశాలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వేసవి దృష్ట్యా చలివేంద్రాలను అన్ని చోట్ల ఏర్పాటు చేయాలని కలెక్టర్ పునరుద్ఘాటించారు.
రూ. 50 లక్షలతో ప్రతిపాదనలు
శ్రీకాకుళం జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి రాజు మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లా నుంచి అందిన రూ.50 లక్షల ప్రతిపాదనల మంజూరుకు త్వరలో చర్యలు చేపడతామన్నారు. సీతంపేట మండలం మెట్టుగూడ వద్ద తాగునీటిపై వచ్చిన వార్తలకు తక్షణ స్పందించి లీకేజీని పునరుద్ధరించామని గ్రామీణ నీటి సరఫరా డీఈ తెలిపారు. సాలూరు, పార్వతీపురం మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్య ప్రస్తుతానికి లేదని, ఎప్పటికప్పుడు వాటిపై దష్టి సారించి చర్యలు చేపడుతున్నామని మున్సిపల్ కమిషనర్లు వివరించారు. వీడియో కాన్ఫరెనన్స్‌లో జిల్లా గ్రామీణ నెట్‌వర్క్ అధికారి ఒ.ప్రభాకర రావు, జిల్లా పంచాయతీ అధికారి టి కొండలరావు తదితరులు పాల్గొన్నారు.