● నమ్మండి.. ఇదే మా పాఠశాల..!
ఈ పూరిపాకే మా పాఠశాల. ఎండకాస్తే మాడిపోవాలి. వానొస్తే తడిచిపోవాలి. ఎన్నోసార్లు పాఠశాలకు భవనం నిర్మించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నా పట్టించుకోవడం లేదు. పశు గోశాలలు నిర్మించడంపై చూపుతున్న శ్రద్ధ మా పాఠశాలపై లేదంటూ బొబ్బిలి మండలం గోపాలరాయుడుపేట పంచాయతీ పరిధిలోని బట్టివలస ప్రాథమిక పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వాపోతున్నారు. ‘బాబూ’.. ‘నాయినా’.. మీకు దండం పెడతాం.. మాకు పాఠశాల భవనం మంజూరు చేయండ ంటూ సోమవారం విజ్ఞప్తిచేశారు. గ్రామానికి చెందిన 8 మంది చిన్నారులు పాఠశాలలో 1, 2 తరగతులు చదువుతుండగా, మరో ఏడుగురు విద్యార్థులు 3వ తరగతి చదువుకోసం మూడు కిలోమీటర్ల దూరంలోని గోపాలరాయుడుపేట పాఠశాలకు వెళ్తున్నారు. ఇదే విషయంపై ఎంఈఓ చల్లా లక్ష్మణరావు స్పందిస్తూ పలు మార్లు పాఠశాల భవనం నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాధనలు పంపించామని, నిధులు మంజూరు కాలేదన్నారు. మరో మారు ప్రయత్నిస్తానని చెప్పారు. – బొబ్బిలిరూరల్


