Vis​​haka: స్టీల్‌ ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం | Major Fire Accident In Vishaka Steel Plant, Heavy Property Damage - Sakshi
Sakshi News home page

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురికి గాయాలు

Jan 13 2024 6:53 PM | Updated on Jan 13 2024 9:18 PM

Major Fire Accident In Vishaka Steel Plant - Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో శనివారం( జనవరి 13) సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్టీల్‌ ప్లాంట్‌లోని బ్లాస్ట్ ఫర్నేస్‌-3లో పేలుడు సంభవించడంతో మం‍టలు చెలరేగాయి. పేలుడు ధాటికి అక్కడే పనిచేస్తున్న పలువురు గాయపడ్డారు.

గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ప్లాంటుకు చేరుకుని మంటలార్పుతున్నారు. అగ్నిప్రమాదం కారణంగా ప్లాంటులో భారీ ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. గతంలోనూ స్టీల్‌ ప్లాంట్‌లో జరిగిన పలు అగ్ని ప్రమాదాల్లో ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించాయి. 

ఇదీచదవండి.. లొంగిపోయి పూచికత్తులు సమర్పించిన చంద్రబాబు

Advertisement
 
Advertisement
Advertisement