మహారాజా బ్యాంక్‌ ఉద్యోగులకు సైబర్‌ శిక్షణ | - | Sakshi
Sakshi News home page

మహారాజా బ్యాంక్‌ ఉద్యోగులకు సైబర్‌ శిక్షణ

Nov 16 2026 12:32 AM | Updated on Nov 16 2026 12:32 AM

సీతంపేట: నగరంలోని ది మహారాజా కో–ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ ఉద్యోగులకు బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌, బోర్డ్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ పర్యవేక్షణలో ఆదివారం క్షత్రియ సంక్షేమ సమితిలో సైబర్‌ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహారాజా బ్యాంక్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం.రామకృష్ణంరాజు బ్యాంక్‌ సిబ్బందికి తగిన సూచనలు, సలహాలు అందించారు. ముఖ్య అథితి కో–ఆపరేటివ్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారి సిహెచ్‌.త్రినాథరావు వినియోగదారులతో ఎలా నడుచుకోవాలి, వారిని మెరుగైన సేవలతో ఎలా సంతృప్తి పరచాలి తదితర విషయాలపై సూచనలిచ్చారు. సైబర్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ ఆదిత్య వర్మ, సైబర్‌ ఇన్వెస్టిగేషన్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ ఎం.సుధీర్‌వర్మ శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో బ్యాంక్‌ జనరల్‌ మేనేజర్లు ఎన్‌.ఎన్‌.సత్యనారాయణ, ఎం.మురళీకృష్ణవర్మ, రాష్ట్రంలోని 13 బ్రాంచ్‌ల మేనేజర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement