బీచ్‌రోడ్డు: ప్రముఖ సుజుకి ద్విచక్ర వాహనాల భారతదేశపు నం.1 డీలర్, పద్మజ సుజుకి అమ్మకాల రంగంలో సరికొత్త రికార్డు సృష్టించింది. 2026 అక్టోబర్ నెలలో అత్యధికంగా 4,022 సుజుకి వాహనాలను విక్రయించి, సంస్థ చరిత్రలోనే అత్యుత్తమ నెలవారీ అమ్మకాలను నమోదు చేసింది. పద్మజ సుజుకి ద్వారా ఇప్పటివరకు విక్రయించిన వాహనాల సంఖ్య 3 లక్షల మైలురాయిని అధిగమించడం మరో విశేషం. ఈ సందర్భంగా వరుణ్ గ్రూప్ చైర్మన్ ప్రభుకిషోర్ మాట్లాడుతూ అక్టోబర్ నెలలో సాధించిన రికార్డు అమ్మకాలు వినియోగదారులు తమపై ఉంచిన నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ విజయానికి సహకరించిన వినియోగదారులు, సిబ్బంది, వ్యాపార భాగస్వాములందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సుజుకి మోటార్‌సైకిల్స్ కంపెనీ రీజనల్ మేనేజర్ వెంకటేష్, ఏఎం సురేంద్ర, పద్మజ సుజుకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినోద్‌కుమార్, జీఎం రఫీ, సిబ్బంది పాల్గొన్నారు.


