మహారాణిపేట: ఎన్‌ఏడీ జంక్షన్‌లోని డొమినోస్ పిజ్జా షాపులో గడువు ముగిసిన ఆహార పదార్థాలు వినియోగిస్తున్నట్టు ఆహార నాణ్యతా పరిశీలన అధికారులు గుర్తించారు. సోమవారం ఆహార భద్రత శాఖ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ఎస్.కల్యాణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పి.శ్రీను డొమినోస్ పిజ్జా షాపుపై దాడులు నిర్వహించారు. పిజ్జాలలు, ఇతర వస్తువులు పరిశీలించారు. గడువు ముగిసిన ఆహార పదార్థాలను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆహార భద్రత ప్రమాణాలకు అనుగుణంగా మెరుగుదల చర్యల కోసం సంబంధిత నిర్వాహకులకు ఇంప్రూవ్‌మెంటు నోటీసులు ఇచ్చినట్టు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ఎస్.కల్యాన్ చక్రవర్తి తెలిపారు. వినియోగదారులకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారం అందించేందుకు ఆహార భద్రత శాఖ నిరంతరం తనిఖీలు నిర్వహిస్తుందన్నారు.


